Rajini Remuneration : నిమిషానికి కోటి రూపాయలా.. రజనీ పారితోషికంపై నెటిజన్ల చర్చ!
Rajini Remuneration : గతేడాది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కథ, కథనం, రజనీ స్టయిల్ అన్నీ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. దీంతో సినిమాపై కలెక్షన్ల వర్షం కాదు కాదు కలెక్షన్ల సునామీ కురిసింది. ఇంతటి భారీ విజయం సాధించింది. దీన్ని పక్కన పెడితే ఆయన నటించిన తాజా చిత్రం ‘లాల్ సలాం’. నమ్మశక్యం కాని మొత్తంతో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా కోసం రజినీకాంత్ రెమ్యునరేషన్‌పై ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా బజ్ క్రియేట్ అయ్యింది.
‘లాల్ సలాం’ పొడిగించిన కథలో అతిథి పాత్రలో 30 నుంచి 40 నిమిషాల నిడివి రజినీకాంత్ కనిపించనున్నాడు. సినిమాకే ఈ 40 నిమిషాలు చాలా క్రూషియల్ గా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. అయితే దీని కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 40 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. తన కూతురు డైరెక్షన్ అయినా కూడా రజనీ ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్.
ఇది రజినీకాంత్ అసాధారణ స్టార్ ప్రభావం, అతని ప్రమేయం సినిమాకు గణనీయమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. స్క్రీన్ పై 30 నిమిషాలు షూట్ చేయడం వల్ల 10-15 రోజుల పనిదినాలు పట్టవచ్చు కాబట్టి నిమిషాల వారీగా బ్రేక్ డౌన్ ను తప్పుగా అర్థం చేసుకోకపోవడం చాలా ముఖ్యం. రజినీకాంత్ వయసు 73 సంవత్సరాలు అయినప్పటికీ, అతనికి తమిళనాడుతో పాటు, దేశ వ్యాప్తంగా ఎటువంటి ఆదరణ గానీ, సినిమాల్లో ఆయన స్టయిల్ గానీ ఏ మాత్రం తగ్గలేదు. ఇదే అతని పాత్రలకు గణనీయమైన పారితోషికాన్ని తెప్పిస్తుంది. అయితే ఆయన ఉనికి కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద లాల్ సలాంను కాపాడలేకపోతోందని తెలుస్తోంది.