Netherlands Vs South Africa : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు నెదర్లాండ్స్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూపు డిలో ఇప్పటికే ఈ రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్స్ లో టాప్ 2 ప్లేస్ లో ఉన్నాయి. గతేడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్ జట్టు సౌతాఫ్రికాకు షాక్ ఇచ్చింది. గ్రూపులో జరిగిన లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై గెలిచి సంచలనం సృష్టించింది.
సౌతాఫ్రికా గెలిస్తే సెమీ ఫైనల్ చేరుకోవాల్సి ఉండగా.. నెదర్లాండ్ పై ఓటమితో లీగ్ లోనే ఇంటి ముఖం పట్టింది. దీంతో పాకిస్థాన్ కు అవకాశాలు వచ్చాయి. సౌతాఫ్రికా ఈ టీ 20 కప్ ను ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ లో డికాక్, రిజా హెన్రిక్స్, మారక్రమ్, క్లాసెన్, స్టబ్స్, మిల్లర్ లతో పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో రబాడ, నోకియా, కేశవ్ మహరాజ్ లాంటి సీనియర్ బౌలర్లు కూడా ఫుల్ పామ్ లో ఉన్నారు.
నెదర్లాండ్ జట్టు నేపాల్ ను ఓడించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అయితే దక్షిణాఫ్రికాపై గెలవాలంటే అంతా ఈజీ కాదు. నెదర్లాండ్ జట్టు తమ స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సిందే. బాస్ డీ లీడ్, వాన్ మీకరన్, లాంటి బౌలర్లు సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేస్తేనే ఏమైనా గెలుపు అవకాశాలు ఉంటాయి.
గ్రూపు డిలో నేపాల్, బంగ్లాదేశ్ లతో ఇంకా ఇరు జట్లు ఆడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. కింగ్స్ టన్ ఓవల్ బార్బడోస్ పిచ్ పూర్తిగా బౌలింగ్ కు అనుకూలిస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో పెద్ద స్కోర్లు నమోదు కాలేదు. నోకియా బౌలింగ్ లో నాలుగు వికెట్లు తీసి ఫామ్ లో ఉండగా.. నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్ ఎలా రాణిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంది.