Netflix crash : గత ఏడాది చివర్లో డిసెంబర్ 22 వ తారీఖున విడుదలైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. సుమారుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మన టాలీవుడ్ లో తెలుగు వెర్షన్ వరకు నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
ఇప్పటికీ పలు థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా నిన్న అర్థ రాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. మొదట ఈ సినిమా ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 వ తేదీన విడుదల చేద్దాం అని అనుకున్నారు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ తో డీలింగ్ విషయం లో చిన్న పొరపాటు జరగడం వల్ల ఫిబ్రవరి 4 వ తేదికి వాయిదా వేశారు.
కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ముందు అనుకున్న డీల్ కి 20 కోట్లు అదనంగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడం తో నిన్న అర్థ రాత్రి నుండి స్ట్రీమింగ్ చేసుకునేందుకు అనుమతిని ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఈ సినిమాకి లక్షల సంఖ్యలో వివిధ దేశాలకు సంబంధించిన యూజర్లు ఒకేసారి నెట్ ఫ్లిక్స్ ని ఓపెన్ చేసారు. దీంతో నెట్ ఫ్లిక్స్ సర్వర్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. దీంతో కాసేపటి వరకు కొంతమందికి నెట్ ఫ్లిక్ ఓపెన్ అవ్వలేదు. ఒక అరగంట వరకు ఇలాంటి సమస్య అనేక మందికి వచ్చింది. అనంతరం నెట్ ఫ్లిక్స్ సంస్థ టెక్నికల్ టీం సర్వర్ కెపాసిటీ ని మరింత పెంచారు. అప్పటి నుండి ఎలాంటి సమస్య లేకుండా స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి ప్రముఖ ఓటీటీ యాప్స్ క్రాష్ అవ్వడం ఇది రెండవసారి. గతం లో ప్రభాస్ ‘ఆహా’ మీడియా లో ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ కి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే రోజు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత దానిని మామూలు పరిస్థితి కి తీసుకొని రావడానికి ఆహా మీడియా టెక్నికల్ టీం కి తల ప్రాణం తోకకి వచ్చింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ సర్వర్ కూడా క్రాష్ అయ్యిందంటే, ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.