Team India Jersey : టీం ఇండియా వరల్డ్ కప్ జెర్సీపై నెగిటివ్ కామెంట్స్..  ఆ కలర్ ఎందుకు?

Team India Jersey

Team India Jersey

Team India Jersey : టీం ఇండియా వరల్డ్ కప్ జెర్సీ గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతోంది. ఎప్పుడు వరల్డ్ కప్ సమయంలో కొత్త జెర్సీలు తీసుకురావడం బీసీసీఐకి అలవాటు. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఐసీసీ టోర్నమెంట్ లలో జెర్సీల మీద ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అని ఏ సంవత్సరం అయితే ఆ ఇయర్ అని రాసి ఉంటుంది.

ఈ జెర్సీని కుల్దీప్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లు గ్రౌండ్ లో చూస్తుండగా.. హెలిక్యాప్టర్ గ్రౌండ్ లోకి వచ్చి టీం ఇండియా జెర్సీని ఆవిష్కరించింది. అయితే ఈ జెర్సీ పూర్తి బ్లూ కలర్ లో కాకుండా షోల్డర్స్ భాగంలో కాషాయ రంగు ఉంది. నెక్ ప్లేస్ నుంచి మూడు రంగుల కలర్ ఉంది. మిగతా భాగమంతా బ్లూ కలర్ నిండి ఉంది.

 దీనిపై నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అచ్చం సర్ప్ ఎక్సెల్ ప్యాకెెట్ లాగా ఉందని ఒకరు.  ఎలక్షన్స్ ఉన్నాయిగా ఈ మాత్రం కాషాయ రంగు కనిపించాలని మరొకరు.  లేదు 2007 వరల్డ్ కప్ జెర్సీలే బాగున్నాయి.  మళ్లీ అలాంటి వాటిని తీసుకురండని ఇంకొకరు.  జెర్సీది ఏముంది మ్యాచ్ లో పర్ఫామెన్స్ చూడాలని కొందరు ఇలా ఇష్టారీతిన ట్రోల్స్ చేస్తున్నారు.

టీం ఇండియా జెర్సీ అంటేనే చాలా మందికి ఇష్టం. మ్యాచ్ జరిగినపుడు టీం ఇండియా జెర్సీ వేసుకుని మ్యాచ్ చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు అభిమానులు. అయితే దీనిపై కూడా ట్రోల్స్ రావడం చూస్తుంటే కొంతమంది క్రికెట్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ 20 మ్యాచ్ లకు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే ఈ వరల్డ్ కప్  మ్యాచ్ ల్లో దాడులు చేస్తామని నార్త్ పాకిస్థాన్ లోని టెర్రరిస్టుల నుంచి మేసేజ్ వచ్చిందని ట్రినిడాడ్ అండ్ టిబాగో ప్రధాని తెలిపారు. అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోనున్నట్లు ఐసీసీ, అమెరికా, కరేబీయన్ దీవుల్లోని ఆయా దేశాల ప్రధానమంత్రులు పేర్కొన్నారు.

TAGS