JAISW News Telugu

NEET Answer Key : నీట్ ఆన్సర్ కీ విడుదల..

NEET Answer Key

NEET Answer Key

NEET Answer Key : మెడికల్ ప్రవేశ పరీక్ష-NEET UG-2024 ఆన్సర్ కీని అదికారులు విడుదల చేశారు. అభ్యర్థులు exams.nta.ac.in/NEET లేదా.. neet.ntaonline.inలో జవాబు కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు నీట్ ఆన్సర్ కీ సమాధానాలపై అభ్యంతరాలుంటే మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించి అభ్యంతరాలను నమోదు చేయాలని అధికారులు సూచించారు. neet.ntaonline.inను ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను దాఖలు చేయాలని, అభ్యంతరాలను నిపుణుల బృందం విశ్లేషించి తుది సమాధాన కీని విడుదల చేస్తుందని అధికారులు తెలిపారు.

నీట్‌ ఎగ్జామ్ దేశ వ్యాప్తంగా 2024, మే 5న నిర్వహించారు. దీని ద్వారా దేశంలోని వైద్య కళాశాలల్లో MBBS, BDS, BAMS, BHMS, BUMS సహా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. ఇది కాకుండా మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (MNS) అభ్యర్థులు కూడా NEET UG మార్కుల ఆధారంగా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్, B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశం పొందచ్చు. ఈ సారి నీట్ పరీక్ష 22 లక్షల మందికిపైగా రాశారు.

NEET కటాఫ్ అంచనా
జనరల్- 50 పర్సంటైల్ 715-117
సాధారణ PH- 45 శాతం 116-105
OBC- 40 పర్సంటైల్ 116-93
SC- 40 పర్సంటైల్ 116-93
ST- 40 పర్సంటైల్ 116-93
OBC PH- 40 పర్సంటైల్ 104-93
SC PH- 40 పర్సంటైల్ 104-93
ST PH- 40 పర్సంటైల్ 104-93

నీట్ టై బ్రేకింగ్ విధానం
నీట్ లో ఇద్దరు లేదంటే ఎక్కువ మంది సమాన మార్కులను పొందితే, మెరిట్‌లో ఎవరు పైస్థానంలో ఉంటారన్నది టై బ్రేకింగ్ విధానం ద్వారా నిర్ణయించబడుతుంది. సమాన మార్కులు వస్తే వారి బయాలజీ మార్కులే వారి ర్యాంకును నిర్ణయిస్తాయి. బోటనీ అండ్ జువాలజీలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ర్యాంక్‌లో ఎక్కువ స్థానం లభిస్తుంది. అదీ కుదరకపోతే కెమిస్ట్రీ మార్కులను, ఆపై ఫిజిక్స్ మార్కులను కంపేర్ చేసి నిర్ణయం తీసుకుంటారు.

Exit mobile version