JAISW News Telugu

Alliance : నష్టం చేసిన వ్యక్తితో పొత్తు అవసరమా ???

Alliance

Alliance

Alliance : దేశంలో పార్లమెంట్ ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. జూన్ నాలుగన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్యనే పోరు నడుస్తోంది. ఎన్డీయే కూటమి నుంచి ప్రధాన మంత్రి మూడోసారి మోదీ కావడం ఖాయం. అదేవిదంగా ఇండియా కూటమి ఇంకా ప్రధాన మంత్రి ఎవరనేది తేల్చుకోలేదు. బలమైన కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి పదవి కోసం కళలు కంటలేదు.

విచిత్రమైన విషయం ఏమిటంటే 17 పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని గెలుస్తామో తెలియదు. ఎందరు కలిసి వస్తారో నేటికీ చెప్పనేలేదు. కానీ 17 పార్లమెంటు స్థానాల్లో గెలిచినట్టుగా ఉహించుకొని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్న అని ఇటీవల జర్నలిస్టులతో మాట్లాడుతూ తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఫజిల్ అయ్యింది.

జూన్ నాలుగున వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి రెండు వందల లోపే సీట్లు వస్తాయని, నాలుగు వందల సీట్లు రావని స్పష్టం చేశారు.  అలాగే ఇండియా కూటమికి కూడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం రాదన్నారు. కాంగ్రెస్ కు అయితే కుప్పకూలిపోవడం ఖాయమన్నారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత కేసీఆర్ రెండుసార్లు భారీగా నష్టం చేశారు.. ఏపీ కి రావాల్సిన నదీ జలాల్లో వాటా లో అన్యాయమే జరిగింది. ఆస్తుల విబజన లో నేటికీ కేసీఆర్ అడ్డుపడుతూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన బాకీ సొమ్ము నేటికీ ఇవ్వలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ల నీటి వాడకం పై కేసీఆర్ మాట్లాడే తీరు ఇబ్బందిగానే ఉంది. అయినా కేంద్రంలో నేనే పగ్గాలు చేపడుతున్నా అంటూ ఉత్తర ప్రగల్భాలు పలుకడం విశేషం.

ఫలితాలు వచ్చిన తరువాత బిఆర్ఎస్ తో ఆమ్ ఆద్మీ పార్టీ, వైసీపీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి వస్తాయని ప్రకటించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ప్రధాన మంత్రి పదవి స్వీకరించినట్లు మాట్లాడారు. కానీ కేసీఆర్ కు మద్దతు విషయంలో మాత్రం 2019 ఎన్నికల్లో మాట ఇచ్చిన నాయకులే, కట్టుబడి ఉండలేక వెనక్కి తిరిగి రావడం విశేషం. ఇప్పుడు ఎందరు వస్తారో వేచి చూడాల్సిందే.

Exit mobile version