JAISW News Telugu

PM Modi : ఎన్డీయే కూటమి ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది: పీఎం మోదీ

FacebookXLinkedinWhatsapp
PM Modi

PM Modi

PM Modi : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఏపీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘ఏపీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యా. సీఎంతో పాటు ప్రమాణం చేసిన మంత్రులందరికీ అభినందనలు. రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఏపీలో ఈరోజు నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామచరణ్ తదితరులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మరో 24 మంది చేత గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.

Exit mobile version