NDA Alliance : ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే పార్టీల అధినేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలు, రోడ్ షోలు, భారీ బహిరంగ సభలతో జనాల్లోకి వెళ్తున్నారు. ఈక్రమంలో మాటల తూటల్లా పేలుతున్నాయి. పంచ్ డైలాగులతో జనాలను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో పలు సంస్థలు జనం నాడీని పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. జనం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో అంచనా వేస్తున్నాయి. తాజా పరిస్థితుల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పే వీడియోలు, ఆర్టికల్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. అందులో ఒక పోస్ట్ ఆసక్తిని కలిగిస్తోంది. దాని ప్రకారం..
ఉత్తరాంధ్ర మొత్తం సీట్లు : 34
టీడీపీ : 25
వైసీపీ : 9
ఉభయ గోదావరి జిల్లాలు :34
టీడీపీ : 28
వైసీపీ : 6
కృష్ణా+గుంటూరు జిల్లాలు :33
టీడీపీ+ 26
వైసిపి…7
ప్రకాశం+నెల్లూరు…22
టీడీపీ : 13
వైసీపీ : 9
మొత్తం కోస్తాంధ్ర : 123
టీడీపీ : 92
వైసీపీ : 31
ఇది ఇప్పటివరకు ఉన్న కోస్తాంధ్ర ముఖ చిత్రం. ఎన్డీఏ కూటమి మెరుగుపడి 100 సీట్లు వరకు సాధించే అవకాశం ఉందని అంటున్నాయి సర్వేలు. ఎన్నికల సమయానికి వైసీపీ 22 కి తగ్గవచ్చు.
ఇక రాయలసీమ విషయానికి వస్తే.. మొత్తం 52 సీట్లు.
టీడీపీ : 22
వైసీపీ : 30
ఇక్కడ కూడా ఎన్నికల సమయానికి కూటమి 28 వరకు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమలో ప్రస్తుతానికి టీడీపీకి 114, వైసీపీకి 61 సీట్లు వచ్చే అవకాశం ఉందంటున్నాయి ఈ నివేదికలు. కూటమి ఎన్నికల సమయానికి ఇదే జోష్ తో ముందుకెళ్తే కూటమికి 128 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలానే వైసీపీ 45- 47 సీట్లకు తగ్గి పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే
రాయలసీమ ఓటరు నాడీ పట్టుకోవడం క్లిష్టంగా ఉందని, ఒకవేళ రాయలసీమ సీట్లను పక్కన పెట్టినా మిగతా ప్రాంతాల్లోని సీట్లతోనే కూటమి అధికారాన్ని చేపట్టే చాన్స్ కనపడుతోంది. ఇక రాయలసీమలో గెలిచే సీట్లు బోనస్ కానున్నాయి.