JAISW News Telugu

Nayanthara : భర్త నుండి నయనతార అవుట్..కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్!

Nayanthara Latest Instagram post viral

Nayanthara Latest Instagram post viral

Nayanthara : నయనతార కి వివాదాలు అంటే ఇష్టమో, లేదా వివాదాలకు నయనతార అంటే ఇష్టమో తెలియదు కానీ, ఆమె సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుండి నేటి వరకు ఎదో ఒక వివాదం ఆమెని వెంటాడుతూనే ఉంది. సతీష్ విగ్నేష్ అనే డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోక ముందు ఈమె పలువురి తమిళ హీరోలతో డేటింగ్ చేసింది అనేది అందరికి తెలిసిన నిజం. ప్రభుదేవా తో పెళ్లి వరకు వెళ్లి రద్దు అయ్యింది.

ఇక ఆ తర్వాత సినిమా మీద ఫోకస్ పెట్టిన నయనతార కి మధ్యలో సతీష్ పరిచయం అవ్వడం, అతనితో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకోవడం వంటివి జరిగాయి. ఇక పెళ్లి తర్వాత నయనతార ఒకదాని  తర్వాత ఒకటి కాంట్రోవర్సి లో చిక్కుకుంటూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు సరోగసి కేసు తో కోర్టు చుట్టూ తిరిగిన నయనతార ఇప్పుడు ‘అన్నపూరని’ చిత్రం తో మరో వివాదం లో చిక్కుకుంది.

తన 75 వ చిత్రం గా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. ఓటీటీ లో విడుదలయ్యాక, మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది కానీ, హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా చాలా సన్నివేశాలు ఉండడం తో హిందూ సంఘాలు అన్నపూరని మూవీ టీం పై కోర్టు లో కేసు వేసింది. పూర్తిగా లీగల్ సమస్యల్లో చిక్కుకోవడం తో నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా ఈ సినిమాని ఓటీటీ నుండి తొలగించింది. రీసెంట్ గా నయనతార భావోద్వేగం తో తన ఇంస్టాగ్రామ్ లో ‘హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా అన్నపూరని సిరీస్ ని చెయ్యాలి అనేది నా ఉద్దేశ్యం కాదు. నేను ఈ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి పరిస్థితి వచ్చిన వెనకడుగు వెయ్యకూడదు అనే సందేశాన్ని పాజిటివ్ పద్దతి లో జనాలకు అందించాలని అనుకున్నానే తప్ప, హిందువుల మనోభావాలు ఇలా దెబ్బ తింటుందని అనుకోలేదు. దయచేసి నన్ను క్షమించండి’ అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది.

ఇది ఇలా ఉండగా ఈమె భర్త సతీష్ తెరకెక్కిస్తున్న ‘LIC’ అనే సినిమాలో నయనతార ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా పై LIC సంస్థ తమ పేరుని వాడుకున్నందుకు కోర్టు లో కేసు వేసిన సంగతి తెలిసిందే. దీంతో టైటిల్ ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుండి ఆమె తప్పుకున్నట్టు కోలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

Exit mobile version