Allu Arjun : తన ప్రవర్తన తో అల్లు అర్జున్ ని ఏడ్చేలా చేసిన నయనతార!
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రస్తుతం ఏ రేంజ్ క్రేజ్ ఉందొ చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మరొకరు లేరు. పుష్ప సినిమాతో ఆయన ఏర్పాటు చేసుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. అలాంటి స్టార్ హీరో తో ఏ హీరోయిన్ అయినా సినిమా చెయయడానికి ఎగబడుతుంది. ఆయన సినిమాలో కాసేపు కనిపించిన ఇండియన్ ఆడియన్స్ మొత్తానికి పరిచయం అయ్యినట్టు అన్నమాట.
అయితే పుష్ప సినిమాకి ముందు అల్లు అర్జున్ ని నయనతార ఒక విషయం లో ఘోరంగా అవమానించింది. ఆమె చేసిన ఆ పనికి అల్లు అర్జున్ కు ఏడుపు ఒక్కటే తక్కువట. ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి ఎలాంటి సినిమాలో కూడా నటించలేదు. అప్పట్లో పలువురు దర్శకులు వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యాలని ప్రయత్నం చేసినప్పటికీ, ఎందుకో అది సెట్ అవ్వలేదు.
ఇదంతా పక్కన పెడితే ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో నయనతార అల్లు అర్జున్ ని చాలా ఘోరంగా అవమానించింది అట. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో నయనతార భర్త సతీష్ విగ్నేష్ దర్శకత్వం లో ‘నానుమ్ రౌడీ తా’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరో గా నటించగా, నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గాను నయనతార కి ఉత్తమ నటిగా ‘ఐఫా అవార్డు’ వచ్చింది. ఈ అవార్డుని అల్లు అర్జున్ తన చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా ఈవెంట్ హోస్ట్ కోరాడు. అయితే స్టేజి మీదకి వచ్చిన తర్వాత నయనతార అల్లు అర్జున్ ని ఘోరంగా అవమానించింది.
ఈ అవార్డు ని నేను సతీష్ విగ్నేష్ చేతుల మీదుగా అందుకోవాలని అనుకుంటున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చింది . దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాగే అవమానం తో స్టేజి దిగి వెళ్ళిపోయాడు. వాస్తవానికి పుష్ప సినిమా లో హీరోయిన్ గా ముందు నయనతార ని తీసుకుందాం అనుకున్నారట. కానీ అల్లు అర్జున్ ఆమెతో అయితే నేను ఈ సినిమా చెయ్యను అని తెగేసి చెప్పడం తో రష్మిక ని తీసుకున్నారు.