JAISW News Telugu

Nattu Kodi Chiken : ‘‘కోడికూర..చిల్లుగారె..’’ కొండెక్కుతున్న నాటు కోడి ధర

Nattu Kodi Chiken

Nattu Kodi Chiken

Nattu Kodi Chiken : దసరా, సంక్రాంతి పండుగలు వచ్చాయంటే నాటు కోడి కూర తినాల్సిందే. పండుగలు, విందులు, ఇంటిల్లిపాదికి ఇష్టమైన మాంసంలోనూ నాటు కోడి ప్రత్యేకత చెప్పక్కర్లేదు. నాటు కోడి కూరను పూరీలు, చిల్లుగారెలతో కలిసి తింటే ఆ మజాను వేరు. ఇటీవల కాలంలో మాంసప్రియులంతా నాటు కోడిని బాగా లాగించేస్తుండడంతో దాని ధర మటన్ తో పోటీ పడుతోంది. ఇక సంక్రాంతి నాటు పందెం కోళ్ల ధరైతే వేలల్లోనే ఉంటుంది. జనాల్లో నాటు కోడి కూరకు విపరీతమైన గిరాకీ ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ, కోళ్లఫారంల్లోనూ వీటి పెంపకం అధికమైంది.

కరోనా టైంలో చాలా మంది తమ రెసిస్టెన్నీ పవర్ పెంచుకోవడానికి కోడి గుడ్లు, చికెన్ పై ఆధారపడ్డారు. కరోనాను ఎదుర్కొవాలంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలని, చికెన్, కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవాలని పలువురు నిపుణులు చెప్పడంతో జనాలంతా కోడిగుడ్లు, ముఖ్యంగా నాటు కోడిపై పడ్డారు. గొర్రె మాంసం గతంలో కిలోకు రూ.700 ఉండగా.. ఇప్పుడు 800-900 పలుకుతోంది. ఇదే క్రమంలో కోళ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.

గతంలో కిలో నాటు కోడి మాంసం రూ.500వరకు ఉండేది. ఇప్పుడా ధర రూ.600లకు చేరింది. చికెన్ సెంటర్ల వద్ద నాటు కోడి మాంసం రూ.800వరకు అమ్ముతున్నారు. అలాగే నాటుకోడి గుడ్లకు సైతం విపరీతంగా డిమాండ్ ఉంది. ఒక్కో గుడ్డు రూ.10లకు అమ్ముతున్నారు. నాటుకోళ్లు నాలుగు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో పెరుగుదలకు వచ్చి విక్రయాలకు అనువుగా ఉంటాయి. నాటుకోడి పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఆదాయం లభిస్తోంది. వీటి కోసం ప్రత్యేకంగా ఫామ్స్ పెడుతుండడం గమనార్హం.

అయితే ఈ మాంసంలో కూడా కల్తీ విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చికెన్ సెంటర్లలో నాటు కోడి మాంసంలో బ్రాయిలర్ కోడి మాంసం కలుపుతున్నారని జనాలు అంటున్నారు. అందుకు మాంసాన్ని కొనేముందు కస్టమర్లు అది నాటుకోడా, బ్రాయిలర్ కోడా చూసి కొనాలని చెబుతున్నారు.

ఇక కొందరు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పెరటి కోళ్లను పెంచుకుంటున్నారు. నాటు కోడి ధర ఓపెన్ మార్కెట్ లో ధరలు ఆకాశన్నంటుతుండడంతో ఇంట్లోనే ఏ ఖర్చు లేకుండా పెంచుకుంటున్నారు. దీంతో కుటుంబానికి సరిపడా మాంసం, కోడి గుడ్లను వారు పొందుతున్నారు.

Exit mobile version