National Human Rights Commission : కొడంగల్ లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్

National Human Rights Commission

National Human Rights Commission

National Human Rights Commission : కొడంగల్ లగచర్ల ఘటనను జాీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపించాలని కూడా నిర్ణయించింది. ఫార్మా కంపెనీ భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 18న ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న మానవ హక్కుల కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది.

వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వడానికి నిరాకరిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారని, బాధితుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఉన్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో పోలీసులు తమను వేధిస్తారనే భయంతో చాలామంది గ్రామస్థులు ఊరి నుంచి బయటకు వచ్చి ఉంటున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో, రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది.

TAGS