JAISW News Telugu

Telangana CS : తెలంగాణ సీఎస్ కు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు

Telangana CS : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) సీఎస్ శాంతికుమారిని ఆదేశించింది. గడువు లోపు నివేదికను అందించకపోతే మానవహక్కుల పరిరక్షణ కింద కమిషన్ ముందు సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రంలోని చాలా స్కూళ్లలో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయని మల్కాజ్ గిరి కార్పొరేటర్ వూరపల్లి శ్రవణ్ గత నెల 18న ఎన్ హెచ్ఆర్ సీకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్ హెచ్ఆర్ సీ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించింది.

Exit mobile version