Nara Lokesh : ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలకు మరో 10 రోజులే ఉండడంతో పార్టీల అధినేతలు ప్రచారం బిజీ అయిపోయారు. రాబోయే రోజులు అన్ని పార్టీలకు కీలకం కావడంతో ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటుంటే.. నారా లోకేశ్ ఎక్కడ అంటూ వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. లోకేశ్ బయటకు వచ్చి ప్రచారం ప్రారంభిస్తే మాత్రం వణికిపోతుంటారు. తాజాగా నారా లోకేశ్ యువగళం ప్రచారాన్ని మరోసారి ప్రారంభించారు. బహిరంగ సభలకు భిన్నంగా యువతను ఆకట్టుకునేలా ఈ ప్రచారం జరుగుతోంది. ఒంగోలు, నెల్లూరుల్లో జరిగిన యువగళం ప్రచారానికి యువత పోటెత్తారు. తమ భవిష్యత్ కు ఎలాంటి గ్యారెంటీ ఇస్తారు..ఎలా ఇస్తారు..అన్నదానిపై వారికి ఉన్న డౌట్స్ ను క్లియర్ చేశారు.
యూత్ మద్దతు టీడీపీకి పెరిగేలా చేయడంలో నారా లోకేశ్ ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రతో గంజాయి బ్యాచ్ మినహా..అభివృద్ధి చెందుదాం అనుకునే ప్రతీ ఒక్క యువతీ,యువకుల మనస్సుల్లో ఆలోచనలు రేకెత్తించేలా చేయడంలో లోకేశ్ సక్సెస్ అయ్యారు. ఉద్యోగం, ఉపాధి, శాంతిభద్రతలు సహా..భవిష్యత్ కు కోసం ఏం చేయాలని..ఎంత కష్టపడాలన్నదానిపై ఓ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు వారిని మరింత మోటివేట్ చేస్తున్నారు.
మొన్నటిదాక శంఖారావం సభలు నిర్వహించారు. అలాంటి సభలు చంద్రబాబు, పవన్, బాలకృష్ణ పెడుతున్నారు. తాను భిన్నంగా యువత కోసం ప్రచారం చేస్తున్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో ఉండేలా డిజైన్ చేసుకున్నారు. అదే టైంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి..ఒక్క ఓటు వైసీపీకి పడినా జరిగే నష్టం నుంచి విశదీకరిస్తున్నారు. ఇతర సీనియర్ నేతలను డామినేట్ చేయకూడదన్న ఉద్దేశంతో వీలైనంతగా హైప్ తక్కువ ప్రచారం చేస్తున్న లోకేశ్..యువతను ప్రభావితం చేయడంలో మాత్రం తన మార్క్ చూపిస్తున్నారు.