Nara Lokesh L అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహం.. ఆవిష్కరించిన నారా లోకేశ్

Nara Lokesh, NTR Statue
Nara Lokesh : ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ పర్యటన అమెరికాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రవాస ఆంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు హెలికాప్టర్ నుంచి గులాబీ రేకులను వెదజల్లారు.
అనంతరం లోకేశ్ మాట్లాడుతూ రెడ్ బుక్ లో ఒక చాప్టర్ ఓపెన్ అయిందని, రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయిందని, మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలని అన్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని, గన్నవరం సభలో తాను కొన్ని హామీలు ఇచ్చానని, అవి గుర్తున్నాయని, ఎలాంటి సందేహం అవసరం లేదని, త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తానని మంత్రి లోకేశ్ అన్నారు.