IND vs PAK : ఇండియా-పాక్ మ్యాచ్ లో నారా లోకేష్, చిరంజీవి, సుకుమార్, ఎంపీల సందడి

IND vs PAK : దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రముఖులు హాజరయ్యారు. మెగా స్టార్ చిరంజీవి,  ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవర్లలో 241 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌద్ షకీల్ 62, రిజ్వాన్ 46, కుష్ దిల్ 38 పరుగులతో రాణించారు. అనంతరం టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది.

ప్రముఖుల హాజరు మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నారా లోకేష్, సానా సతీష్, కేశినేని చిన్ని, సుకుమార్‌లు, చిరంజీవిలు మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు.. సుకుమార్ మాట్లాడుతూ, “క్రీడలు స్నేహం మరియు సమగ్రతకు ప్రతీక. ఇరు జట్లూ అద్భుతంగా ఆడాయి” అని తెలిపారు.

ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు చిరస్మరణీయంగా నిలిచింది. ప్రముఖుల హాజరు ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మలిచాయి.

TAGS