JAISW News Telugu

Nara Lokesh : మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డి.. నారా లోకేష్ 

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh :  నాలుగేళ్ల 10 నెలలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన జెండా దించకుండా, మడమతిప్పకుండా కాపుకాసిన పసుపు సైన్యానికి నా నమస్కారాలని టిడిపి జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ అన్నారు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం అని శ్రీకాకుళం అంటే సింహం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే ఉంది కష్టపడేతత్వం ఉంది అని ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వాసులే ఉంటారనీ లోకేష్ అన్నారు.శ్రీకాకుళం ప్రజల స్పీడే వేరు, మీ పట్టే వేరు. ఎవరైనా మంచిపని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరైనా హాని చేస్తే తాటతీస్తారు. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇదనీ లోకేష్ అన్నారు.

అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఇక్కడ నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తు న్నాననీ లోకేష్ అన్నారు.జగన్ రెడ్డికి ఒక శాపం ఉంది. నిజం చెబితే ఆయన తల పగిలిపోతుంది. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డి. పాదయాత్రలో దొరికిన ప్రతి మహిళకు ముద్దులు పెట్టారు. తర్వాత గుద్దులు గుద్దుతున్నారు.

జాబ్ కేలండర్ కాస్తా సాక్షి కేలండర్ లా మారింది. డీఎస్సీ మోసం, బీసీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య, 6500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి ఏడాది భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారు.

ఎన్నికలకు ముందు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. సమయం లేకపోవడమే కాదు.. పోస్టులు కూడా తక్కువ. 800 గ్రూప్ -2 పోస్టులకు 5 లక్షల మంది రాశారు. ఇది ప్రజలకు జగన్ రెడ్డి చేసిన మోసం కాదా అని లోకేష్ ప్రశ్నించారు.

రెండు నెలలు ఓపికపట్టండి, టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది. ఏటా జాబ్ కేలండర్ ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం.నిరుద్యోగులు అధైర్యపడవద్దు. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు నెలలు ఓపిక పడితే అందరినీ ఆదుకుంటాం.జగన్ బిల్డప్ బాబాయి.

కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారు. అది కాస్తా వైకాపా నాయకులకు అంతిమయాత్ర అయిందనీ ఆయన ఆరోపించారు.ఆ సినిమా చూడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. క్వార్టర్ ఇచ్చినా చూసే ప్రసక్తే లేదు.జగన్ రెడ్డి సైకో, హిట్లర్. మనం చేసిన మంచి పనులకు రంగులు వేసి తామే కట్టామని బిల్డప్ ఇస్తారు.

మనం కొన్న భూమి పత్రాలపైనా జగన్ రెడ్డి ఫోటోలే. సర్వే రాళ్లపైనా జగన్ రెడ్డి బొమ్మ. మీ బిడ్డ,మీ బిడ్డ అని భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు గారిలా మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నారు. జగన్ రెడ్డి అంటే జైలు. చంద్రబాబును చూస్తే విజనరీ గుర్తుకువస్తాడు.

ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపారు. లక్ష కోట్లు లూటీ చేసిన జగన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తాడు. జగన్ కు సవాల్  విసురుతున్నా…అవినీతి ఆరోపణలపై చర్చకు మేం సిద్ధం, మీరు సిద్ధమా?బాంబులకే భయపడని కుటుంబం మాది… కేసులకు భయపడతామా?

నేను రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. తప్పు చేస్తే వచ్చి అరెస్ట్ చేసుకోండి.సొంత అమ్మ, చెల్లే జగన్ రెడ్డిని నమ్మడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఇంటి నుంచి గెంటేశారు. షర్మిలపై వైకాపా పేటీఎం కుక్కలు ఇష్టానుసారం మాట్లాడు తున్నారు. ఎవరికి పుట్టావు, పెళ్లిళ్లపై మాట్లాడు తున్నారు. వైఎస్ పరువు కూడా తీసేసే పరిస్థితికి తీసుకువచ్చారు.

ఇంట్లో మహిళలకే రక్షణ కల్పించలేని వ్యక్తి మనకు రక్షణ కల్పిస్తాడా? జగన్ ను చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తుకు వస్తాడు.బల్లపైన బ్లూ బటన్ నొక్కి రూ.10వేసి, కింద ఉన్న రెడ్ బటన్ నొక్కి వంద కట్ చేస్తాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుదు. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, త్వరలో పీల్చే గాలిపైనా పన్ను వేసే వ్యక్తి జగన్.

Exit mobile version