Nara Lokesh : వైఎస్ జగన్ తన హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది వైసీపీ కార్యాలయాలకు భూముల కేటాయింపు. రాష్ట్ర రాజధాని అమరావతిలో వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని ఇటీవల ప్రభుత్వం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ సీఆర్డీఏ వైసీపీ పార్టీ హై కమాండ్ కు నోటీసులు ఇచ్చింది. దీనిపై సరైన సమాధానం చెప్పకుండా సదరు పార్టీ కోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రభుత్వ అధికారులు వెంటనే నిర్మాణాలను తొలగించారు. అయితే ఒక్క అమరావతిలోని వైసీపీ కార్యాలయమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిబంధనలకు కూడా వైసీపీ నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించి కార్యాలయాలను నిర్మించిందని టీడీపీ మండిపడుతోంది. ఏపీలో ఇదే టాపిక్ హాట్ హాట్ గా మారింది.
వైసీపీ 2010లో ఆవిర్భవించింది. 2014లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 175 సీట్లకు 67 గెలుచుకుంది. 2019లో ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. 151 సీట్లను తన ఖాతాలో వేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. పాలనలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా విభజించింది. ప్రతీ జిల్లాకు సంబంధించి 26 చోట్ల పార్టీ కార్యాలయాలు నిర్మించాలని భావించారు. ఇందుకు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. రూ. 1000 నామమాత్రపు లీజుతో ఈ భూములను కేటాయించారు. కొన్ని జిల్లాల్లో భవనాల నిర్మాణం కూడా పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో నిర్మాణం కొనసాగుతోంది. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమని టీడీపీ ఆరోపిస్తోంది. భవనాలకు సంబంధించి నోటీసులు కూడా జారీచేసింది.
జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42… pic.twitter.com/tThP2mDMPh
— Lokesh Nara (@naralokesh) June 23, 2024