Nara Lokesh : ఏపీలో యూరప్ యూరో కార్ట్స్.. చిరు వ్యాపారులకు అందజేసిన నారా లోకేశ్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh : ఎన్ఆర్ఐ జై కుమార్ గుంటుపల్లి (Jai Kumar) వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. యూరప్‌లో విజయవంతమైన యూరో కార్ట్‌‌ల ను (Eurocrats) ఆంధ్రప్రదేశ్‌లో చిరు వ్యాపారులకు పరిచయం చేయాలని అనుకున్నారు.

ఎన్ఆర్ఐ టీడీపీ అధినేత డాక్టర్ రవి వేమూరితో (Ravi Vemuri) ఈ విషయం మాట్లాడారు. ఆ అంశం గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. జై కుమార్ సంకల్పానికి నారా లోకేష్ (Nara Lokesh) వెన్ను తట్టి ప్రోత్సహించారు. మంగళగిరిలో యూరో కార్ట్‌లను (Eurocrats) చిరు వ్యాపారులకు నారా లోకేశ్ అందజేశారు. యూరప్ ఖండంలో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల నుంచి ఆహారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఆ యూరో కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసే ఆహారం, పదార్థాలు సురక్షితమైన వని ప్రజలు విశ్వసిస్తారు. యూరో కార్టులను ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం చేశారు.

వీధి వ్యాపారులు, తోపుడు బండ్లు, ఫుడ్ స్టాల్స్ వద్ద ఆహారం పరిశుభ్రంగా ఉండదనే భావన తొలగించాలనే ఉద్దేశ్యంతో యూరో కార్ట్‌లను ఏపీలో పరిచయం చేశారు. యూరో కార్ట్స్ ఇటు కస్టమర్లకు అటు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. యూరో కార్ట్స్ ద్వారా చిరు వ్యాపారు ల ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది. యూరో కార్ట్స్ వల్ల తోపుడు బళ్లను అద్దెకు ఇచ్చే స్థానిక మాఫియాను నిర్మూలించే అవకాశం కలుగుతుంది. చిరు వ్యాపారులు రుణ విముక్తులు అవుతారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని, తన నియోజక వర్గం మంగళగిరిలో నారా లోకేశ్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

TAGS