
Nara Lokesh
Nara Lokesh : తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, కార్యకర్తల కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. 70 లక్షల మంది కార్యకర్తలే తెలుగుదేం పార్టీ ఆస్తి అని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని అన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లాలోని పలు జిల్లాలకు చెందిన వైకాపా నేతలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ నారా లోకేశ్ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో చేరినవారిలో మాజీ ఎమ్మెల్యే రావిపాడు రమణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 50 మంది సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుభానితో పాటు 500 మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.