Nara Lokesh : రికార్డు సృష్టించిన నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ఏపీ లో ఇప్పుడు ప్రజల దృష్టి  అంతా కూడా ఆ నియోజకవర్గం పైననే ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నది ఎవరో కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆ నియోజక వర్గంలోనే ప్రధాన నాయకుల ఓట్లు కూడా అక్కడే ఉండటం విశేషం. అంతేకాదు మంగళగిరిలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతం కావడం విశేషం. సీఎం జగన్ ఓటు మంగళగిరిలోనే ఉన్నప్పటికీ ఆ ఓటు ఆయన పార్టీ అభ్యర్థికి వేసుకున్నారు. కానీ లోకేష్ తన ఓటు తో పార్టీ మరో రెండు ప్రధాన నాయకుల ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండవల్లి లో నివాసం ఏర్పరచుకున్నారు. ఉండవల్లి ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రబాబు నాయుడు తన ఓటును టీడీపీ అభ్యర్థికే వేశారు. అంటే టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కావడంతో చంద్రబాబు ఓటు లోకేష్ కె పడింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు కూడా మంగళగిరిలోనే ఉంది. ఆయన కూడా తన ఓటును తెలుగు దేశం పార్టీ అభ్యర్థి, అందులోనూ మిత్రపక్షం కావడంతో పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ కె వేసి ఉంటారు. పవన్ కళ్యాణ్ మిత్ర పక్షం తో కలిసి పోటీలో ఉన్నారు కాబట్టి తన ఆపార్టీ అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి ఓటు వేయక తప్పలేదు. మంగళగిరిలో రెండోసారి పవన్ కళ్యాణ్ ఓటువేశారు. 2019 లో ఓటు వేసినప్పుడు తన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయలేదు. తాజా ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి తన పార్టీ అభ్యర్థి పోటీ చేయకపోవడంతో కూటమి అభ్యర్థి కే తన ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఈ విధంగా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ప్రధాన నాయకుల ఓట్లను తన ఖాతాలో వేయించుకోవడం విశేషం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ఓట్లు అక్కడే ఉండటంతో లోకేష్ గెలిచిన నేపథ్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

TAGS