Nara Bhuvaneshwari : లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడంతో నారా చంద్రబాబు నాయుడు కుటుంబ కంపెనీల స్టాక్స్ భారీగా లాభాలను ఆర్జించాయి. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ రూ.424 వద్ద ట్రేడయింది. అయితే శుక్రవారం ఈ షేర్ విలువ రూ.661 కు చేరుకుంది. దీంతో కంపెనీ ప్రమోటర్ నారా భువనేశ్వరి షేర్ల విలువ ఏకంగా రూ.579 కోట్లకు పెరిగింది.
ఈ కంపెనీలో నారా లోకేశ్ కు కూడా పెద్ద సంఖ్యలో షేర్లు ఉన్నాయి. వాటి విలువ రూ.237.8 కోట్లకు పెరిగింది. బీఎస్ఈ డేటా ప్రకారం నారా భువనేశ్వరి కంపెనీ టాప్ షేర్ హోల్డర్, ఆమె 2 కోట్ల 26 లక్షల 11 వేల 525 స్టాక్ లను కలిగి ఉన్నారు. నారా లోకేశ్ కు 1 కోటి 37 వేల 453 వాటాలు ఉన్నాయి. 1992లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్ ను స్థాపించారు.