JAISW News Telugu

Nara Bhuvaneshwari : ఎంపీగా నారా భువనేశ్వరి! అక్కడి నుంచే పోటీ!

Nara Bhuvaneshwari as MP

Nara Bhuvaneshwari to contest as MP candidate

Nara Bhuvaneshwari : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా తన సతీమణి నారా భువనేశ్వరి పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న (శనివారం) జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

తాజాగా సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నికి లైన్ క్లియర్ అయ్యిందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా నారా భువనేశ్వరి పేరు తెరపైకి వచ్చింది.

తెలుగుదేశం నుంచి ఎంపీ అభ్యర్థిగా భువనేశ్వరిని బరిలోకి దింపాలనే ఆలోచనతో చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని పార్టీ మారడం చాలా కష్టంగా మారనుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై నాని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

నాని వ్యాఖ్యలను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. కేశినేని నానిని ఓడించి విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో మరోసారి పార్టీ బలాన్ని నిరూపించుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే భువనేశ్వరిని బరిలోకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న రోజులు తెలుగింటి ఆడబిడ్డగా భువనేశ్వరికి మహిళ్లు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఆ సెంటిమెంట్ ను ఇప్పుడు వాడుకుంటే కలిసి వస్తుందని బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు కేశినేని నాని గర్వం కూడా అనిచిన వారం అవుతున్నారని భావిస్తున్నారు.

Exit mobile version