JAISW News Telugu

Nani Heroine : నాని సరసన హిరోయిన్..  ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి

Nani Heroine

Nani Heroine

Nani Heroine : హిరో నాని తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా 2010లో విడుదలై మంచి టాక్ ను అందుకుంది. కానీ కలెక్షన్ల పరంగా నిరాశపరించింది. కబడ్డీ నేపథ్యంలో పల్లెటూరు వాతావరణంతో తీసిన ఈ సినిమా చూడముచ్చటగా ఉంటుంది. తమిళ చిత్రం వెన్నిళ కబడీ మూవీకి రీమెక్ గా వచ్చింది. అయితే ఈ సినిమాలో నాని సరసన శరణ్య మోహన్ హిరోయిన్ గా నటించింది.

శరణ్య మోహన్ తమిళ్, మలయాళ మూవీస్ లో ఎక్కువ గా కనిపించింది. కన్నడ, హిందీ మూవీల్లో కూడా యాక్ట్ చేసింది. తెలుగు లో మాత్రం వినాయకుడు మూవీతో అరంగ్రేటం చేసింది. బీమిలి కబడ్డీ జట్టు, కత్తి, హ్యపీ హ్యాపీగా మూవీల్లో కూడా నటించి మెప్పించింది. కల్యాణ్ రామ్ కు కత్తి సినిమాలో చెల్లెలిగా యాక్ట్ చేసింది.

అనంతరం సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది. చిన్నప్పటి ఫ్రెండ్స్ డాక్టర్ అరవింద్ కృష్ణన్ ను 2015 సంవత్సరంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల్లో ఎంతో క్యూట్ గా బబ్లీ గర్ల్ గా కనిపించే శరణ్య సినిమాలకు దూరమైన తర్వాత కాస్త లావు గా కనిపిస్తోంది. మూవీస్ చేయకున్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ ఉంటుంది. తన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు పండగ చేసుకోమని చెబుతుంది.

శరణ్య మోహన్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావడంతో తెలుగు సినీ ప్రేక్షకులు కూడా బాధపడుతున్నారు. శరణ్య మళ్లీ కెమెరా ముందుకు రావాలని మరిన్ని మంచి సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. చాలా వరకు ఇలాంటి పోస్టులు చూసి ఆమెను నవ్వుకుంటూ ఉండొచ్చు. చాలా మంది సెలబ్రెటీలు సినిమాలు చేసి అవకాశాలు రాకపోగానే.. మంచి డాక్టర్, లేదా కోటీశ్వరుడిని చూసి పెళ్లి చేసుకుంటారు. వారికి సినిమాలు చేసే పని ఉండదు. శరణ్య కూడా మంచి సెటిల్ అయిన డాక్టర్ పెళ్లి చేసుకుంది. ఇంకా సినిమాలు ఎందుకు చేస్తుందని కొంతమంది అంటున్నారు.

Exit mobile version