Nandini ghee : ఆలయాలలో నందిని నెయ్యి వాడాలి.. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

Nandini ghee
Nandini ghee : తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి చర్చనీయాంశమైన వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలకు కేవలం నందిని నెయ్యిని మాత్రమే వాడాలని శనివారం (సెప్టెంబరు 21) ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించడం, ప్రసాదం తయారీ, దాసోహ భవనాలు వంటి ఆలయ ఆచారాల కోసం నందిని నెయ్యి వాడటాన్ని తప్పనిసరి చేసింది.
కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాలు, ఇతర పదార్థాల తయారీకి నాణ్యమైన నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆ రాష్ట్ర మంతి రామలింగారెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను తరచూ పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. ఆలయాల్లోని ప్రసాదాల తయారీలో నాణ్యతను పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.