Janasena Rama Devi : ‘నందిగామ జనం’ జనసేనకే జై..రమాదేవి గెలుపు నల్లేరుపై నడకే..
Janasena Rama Devi : ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. హేమాహేమీలను అందించిన ఈ నియోజకవర్గంలో మరో రెండు నెలల్లో జరుగబోయే ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని, ఓటర్ల నాడీని బట్టి తెలుస్తున్నది ఏమిటంటే జనసేన సీనియర్ నేత, జనసేన నియోజకవర్గ సమన్వయ కర్త తంబళ్లపల్లి రమాదేవికి మిగతా వారికంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నియోజకవర్గ వివరాలు:
ఈ నియోజక వర్గంలో మూడు మండలాలు మాత్రమే ఉన్నాయి. అవి కంచికచెర్ల, చందర్లపాడు, వీరుల్లపాడు, నందిగామ(కొద్దిప్రాంతం).
నియోజకవర్గ నేపథ్యం:
గత ఇరువై ఏండ్లుగా చూస్తే.. 2004 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా మహేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత నాగేశ్వరరావుపై 4,285 ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు..వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావుపై గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తంగిరాల సౌమ్య గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు..టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యపై విజయం సాధించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి దేవినేని వెంకటరమణ, వసంత నాగేశ్వరరావు వంటి ప్రముఖులు గెలిచారు. ఇది 2009 నుంచి ఎస్సీ నియోజకవర్గంగా కొనసాగుతోంది.
ప్రస్తుత పరిస్థితి..
ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి సీటును పొత్తులో భాగంగా తమకే కేటాయించాలని టీడీపీ, జనసేన రెండూ కోరుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ పడడానికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ స్థానంలో టీడీపీ కంటే జనసేనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జనసేన సీనియర్ నేత,
జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి అంటున్నారు. తమకే సీటు కేటాయించాలని, ప్రజాబలం తమకే ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఆమె నియోజకవకర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఒకవేళ ఈ సీటును టీడీపీకి కేటాయిస్తే.. ఆపార్టీలోని అంతర్గత విభేదాల వల్ల అభ్యర్థి తంగిరాల సౌమ్య ఓడిపోవడం ఖాయమంటున్నారు. అలాగే జగన్మోహన్ రావును ఎదుర్కొవడానికి సౌమ్య అంగ, అర్ధ బలం సరిపోదని అంటున్నారు. తండ్రి తంగిరాల ప్రభాకర్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సౌమ్య అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై గట్టిగా పోరాడలేకపోతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే టీడీపీలో వర్గ పోరు నష్టం చేకూర్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
రమాదేవికి అక్కడి ప్రజల్లో ఉన్న పేరు, పలుకుబడి, పవన్ కల్యాణ్ అభిమానగణం, విపరీతంగా ఉన్న జనసైనికులు జనసేన గెలుపు నల్లేరు నడక అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆమె ‘పల్లె పథాన జనసేన’ అనే కార్యక్రమంతో జనాలతో మమేకమయ్యారు. మహిళలు, కొత్త ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గ సీటు జనసేనకు రావడం గ్యారెంటీ అని, రమాదేవి గెలుపు పక్కా అని అక్కడి జనసైనికులు ఘంటాపథంగా చెబుతున్నారు.