Nandamuri Balakrishna : పద్మభూషణ్ కు నందమూరి బాలకృష్ణ పేరు నామినేట్!

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna : నందమూరి అభిమానులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం తరపున పద్మభూషణ్ అవార్డుకు గాను ఏపీ ప్రభుత్వం బాలకృష్ణ పేరును ఎంపిక చేసి కేంద్రానికి పంపినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ క్యాబినేట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు తెలుస్తోంది. ఇటీవల సినీ రంగంలో 50 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బాలయ్య, తన కెరీర్ లో 108 సినిమాలు చేశారు. అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగాను ‘అన్ స్టాపబుల్’ షోతో రికార్డు క్రియేట్ చేశారు. ఇటు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు.
ఏపీలో హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ క్రియేట్ చేశారు. అలాగే తన తల్లి బసవతారకం పేరిట క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం అందజేసే అవకాశం ఉంది.