Nandamuri and YSR Family : నందమూరి, వైఎస్ఆర్ కుటంబీకులే ఆ నాలుగు పార్టీల సారథులు తెలుసా?
Nandamuri and YSR Family : ఇన్నాళ్లు తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని పార్టీలు గగ్గోలు పెట్టాయి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ కుమార్ ఇలా ఒకే కుటుంబంలో ఐదుగురు రాజకీయం చేశారు. దీంతో కుటుంబ పాలన అంతం కావాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. చివరకు విజయం సాధించింది. వారి నుంచి అధికారాన్ని తిరిగి తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మారిపోయింది.
ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితే ఎదురైంది. రెండు కుటుంబాలే రాజకీయం చేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఇలా రెండు కుటుంబాల వారే అధికారం చెలాయిస్తున్నారు. జగన్, షర్మిల వైఎస్ కుటుంబం, చంద్రబాబు, పురంధేశ్వరి నందమూరి కుటుంబం కావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
భవిష్యత్ లో రాజకీయాలు ఎలా ఉంటాయి. రెండు కుటుంబాలు వైరంగా మారతాయా? లేక కలిసే ఉంటాయా? అనేది సందేహమే. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. అధికారం కోసం ఇరు కుటుంబాలు ఏం చేయనున్నాయి. ప్రత్యర్థులుగా మారి విమర్శలు చేసుకుంటారా? లేక అధికారం ఎవరికైనా ఫర్వాలేదని సర్దుకుపోతారా? అనేది సగటు ఓటరులో వస్తోంది.
షర్మిల ఇటీవల కాంగ్రెస్ లో చేరడంతో నూతనోత్తేజం వచ్చినట్లు అయింది. పార్టీలో చేరికలు ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయం రసకందాయంలో పడింది. ఇరు కుటుంబాలు ఎలా రాజకీయం చేస్తాయి? నలుగురు చుట్టాలే కదా ఎలా స్పందిస్తారనే తపన అందరిలో కలుగుతోంది. ప్రస్తుతం వారి మదిలో ఏముందో తెలియడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.