Nana Patekar Strange Behavior : నానా పాటేకర్ వింత ధోరణి.. షూటింగ్ స్పాట్ లోనే తన అభిమానితో అలా.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..
![Nana Patekar Strange Behavior](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2023/11/16120623/Nana-Patekar-Strange-Behavior-650x366.webp)
Nana Patekar Strange Behavior
Nana Patekar Strange Behavior : నానా పాటేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారాయన. ఆయన పేరు ఎక్కువగా మీటూ ఉద్యమంలో వినిపించింది. ఒక సమయంలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఆయనపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. ఆయన కారణంగానే మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. నానా పాటేకర్ తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె బహిరంగంగానే చెప్పింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.
ఈ కామెంట్సే ‘మీటూ’ ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు బీజం వేసింది. అలా తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో భారీగా వివాదంలో చిక్కుకున్న పాటేకర్ రీసెంట్ గా మరో వివాదానికి గురయ్యారు. షూటింగ్ స్పాట్ లో ఒక అభిమాని ఆయన వద్దకు వచ్చి తనతో సెల్ఫీ తీసుకుంటానని ప్రయత్నించాడు. కానీ నానా పాటే కర్ మాత్రం ఆయనపై చేయిచేసుకున్నాడు. ఇది కాస్తా కాంట్రవర్సీగా మారింది. అయితే ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వారణాసిలో షూటింగ్ జరుపుకుంటున్న ‘అప్ కమింగ్’ స్పాట్ లో మంగళవారం (నవంబర్ 14) ఈ ఘటన జరిగింది.
షూటింగ్ లో భాగంగా వీధుల్లో కొన్ని సన్నవేశాలను చిత్రీకరిస్తున్నారు. సెట్ మధ్యలోకి దూసుకచ్చిన యువకుడు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. సదరు యువకుడిని గమనించి నానా పాటేకర్ వెనుక నుంచి వచ్చి తలపై కొట్టాడు. వెంటనే పక్కనే ఉన్న బౌన్సర్ ఆ యువకుడిని బయటకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను తమ సెల్ ఫోన్ వీడియోలో బంధించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతుండగా.. అభిమానులు పెదవి విరుస్తున్నారు. ‘నటులను విపరీతంగా అభిమానించి దేవుళ్లుగా భావిస్తే వారితో దెబ్బలు తినాలి. ఇంత అనుభవం, స్టార్ ఇమేజ్ ఉన్న నానా పాటేకర్ యువకుడిని కొట్టడం నిజంగా దారుణం.’ అంటూ వివిధ రూపాల్లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
#WATCH | वाराणसी में फिल्म जर्नी की शूटिंग कर रहे नाना पाटेकर का फैन को थप्पड़ मारते हुए वीडियो वायरल हो गया। फैन नाना पाटेकर संग सेल्फी लेने पहुंचा तो अभिनेता ने गुस्से में उसके सिर पर थप्पड़ मारा। फिल्म की यूनिट के सदस्य ने लड़के की गर्दन पकड़कर भगाया। pic.twitter.com/oU2WrY2Bv1
— Hindustan (@Live_Hindustan) November 15, 2023