Namrata : ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ నమ్రత ఎమోషనల్ పోస్ట్!

namrata emotional post on guntur kaaram pre release event

namrata emotional post on guntur kaaram pre release event

Namrata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం మరో రెండు రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయిపోయింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ ద్వారా రికార్డు స్థాయి గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా ఈ చిత్రం అడుగులు వేస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాన్ రాజమౌళి రికార్డు పెట్టే దిశగా దూసుకుపొయ్యే అవకాశం ఉంది.

రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా టికెట్ రేట్స్ పెంపుకు అనుమతిని ఇచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరు లో ఘనంగా జరిగిన సంగతి మనకి తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారిని తల్చుకొని బాగా ఎమోషనల్ అవుతాడు. ఈ మాటలు అభిమానుల మనసులో చాలా బలంగా నాటుకుపోయాయి.

ఇన్ని రోజులు నా ప్రతీ సినిమాకి నాన్న గారు ఫోన్ చేసి రికార్డ్స్ గురించి చెప్తూ ఉంటే చాలా సంతోషం గా ఉండేది. ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఆయన నాతో లేరు. ఇక నుండి మీరే నాకు అమ్మా- నాన్న..ఈ సినిమా రికార్డ్స్ గురించి మీరే చెప్పాలి నాకు అంటూ ఎమోషనల్ అయ్యాడు. మహేష్ ఇచ్చిన నిన్నటి స్పీచ్ కి ఆయన సతీమణి నమ్రత శిరోడ్కర్ చాలా ఎమోషనల్ అయ్యింది.

ఇంస్టాగ్రామ్ లో ఆమె దీనిపై ఒక పోస్ట్ పెడుతూ ‘ మహేష్ ఫ్యాన్స్ గురించి అందరూ నాతో ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆయనని ఎన్నో లక్షల మంది దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు. నిన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులు చూపించిన ప్రేమని చూసి నా కళ్ళు చెమర్చాయి. ఈ సందర్భంగా నేను మహేష్ కి ఒక్కటే చెప్పదల్చుకున్నాను, మహేష్..అంభిమానులకు మీరొక ఎమోషన్, ఈ అంతులేని ప్రేమ మీ మధ్య అలాగే సాగాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మహేష్ ఫ్యాన్స్ కి ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎంతో స్పెషల్, ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మహేష్ మాటలు కూడా ఎంతో స్పెషల్. మరి సినిమా కూడా అంతే స్పెషల్ గా ఉంటుందో లేదో అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

TAGS