Namrata Comments : సౌత్ ఇండియా లో మాత్రమే కాదు , ఇండియా మొత్తం మీద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో మహేష్ బాబు, నమ్రత జంట ముందు వరుసలో ఉంటుంది. చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో, ఎన్నో ఏళ్ళ నుండి కాపురం చేస్తూ, ఇద్దరు పిల్లలను పోషిస్తూ, ఇంత దూరం దాంపత్య జీవితం కొనసాగించడం అనేది చిన్న విషయం కాదు.
‘వంశీ’ సినిమాతో ప్రారంభమైన వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇండస్ట్రీ లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు ఆరోజుల్లో మహేష్ బాబు. పెళ్లి తర్వాత నమ్రత శిరోద్కర్ కి సినిమాలు చెయ్యకూడదు అని మహేష్ బాబు ఆంక్షలు పెట్టాడని స్వయంగా నమ్రత శిరోద్కర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అంతకు ముందు ఆమె బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
బాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె, తెలుగు లో మాత్రం కేవలం మహేష్ బాబు తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించింది. ఆ తర్వాత మహేష్ ని పెళ్లాడిన తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నమ్రత ని ఒక యాంకర్ ప్రశ్న అడుగుతూ ‘మీరు ఒకప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్. ఇప్పుడు మీకు మళ్ళీ సినిమాల్లో ఎప్పుడైనా నటించాలని అనిపించిందా?’ అని అడగగా, దానికి నమ్రత సమాధానం చెప్తూ ‘నాకు మళ్ళీ సినిమాల్లోకి రావాలి అనే ఆసక్తి పోయింది. కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ భార్యలు లాగ నేను ఉండలేను’ అంటూ చెప్పుకొచ్చింది.
కనీసం మహేష్ తో కలిసి ఒక చిన్న సన్నివేశం లో అయినా కనిపించొచ్చు కదా అని అడగా ‘మహేష్ వచ్చి బ్రతిమిలాడినా కూడా నేను నటించేందుకు ఒప్పుకోను’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనిని బట్టీ నమ్రత ఒక్కసారి మాట ఇస్తే కట్టుబడి ఉంటుంది అనే ఇషయం అర్థం అవుతుంది, ఇలాంటి భార్య ఏ మగవాడికి వచ్చినా అతని జీవితం ధన్యం అవుతుందని ఈ సందర్భంగా నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.