Pallavi Prashanth:ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కు బిగ్ రిలీఫ్‌..నాంప‌ల్లి కోర్టు బెయిల్

Pallavi Prashanth:బిగ్‌బాస్ సీజ‌న్ 7 విన్న‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌ని విజేత‌గా ప్ర‌క‌టించిన అనంత‌రం అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌రిస‌రాల్లో, కృష్ణాన‌గ‌ర్ రోడ్ల‌పై ఆర్టీసీ బ‌స్సుల‌పై అభిమానులు విశ్వంసం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌న‌ల‌కు బాధ్యుడిగా చేరుస్తూ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌, అత‌ని సోద‌రుడు మ‌హావీర్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేసిన విష‌యం తెలిసిందే, అనంత‌రం కోర్టులో హాజ‌రు ప‌రచ‌గా నాంప‌ల్లి కోర్టు వీరికి 14 రోజుల పాటు రిమాండ్‌ని విధించింది. సోమ‌వారం నుంచి చంచ‌ల్ గూడ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్, అత‌ని సోద‌రుడికి తాజాగా బెయిల్ ల‌భించింది.

గురువారం ప్ర‌శాంత్ నాంప‌ల్లి కోర్టులో బెయిల్‌కు ప్ర‌య‌త్నించ‌గా వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును శుక్ర‌వారానికి వాయిదా వేసింది. తాజాగా ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. అంతే కాకుండా ఆదివారం పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా రూ.15 వేల రూపాయ‌ల రెండు షూరిటీల‌ను కూడా స‌మ‌ర్పించాల‌ని ఆదేశించి ఫైన‌ల్‌గా అత‌నికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో అత‌ని అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

TAGS