Telugu Years Names : నారదుడి 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాల పేర్లు..

Telugu Years Names

Narad Maharshi.Telugu Years Names

Telugu Years Names : లోక కళ్యాణం కోసం తపన పడే నారాయణ భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నారదుడే కదా. భక్తి అనేదానికి చాలా నిర్వచనాలే ఉన్నాయి. ఒక్కొక్కరి భక్తికి ఒక్కొక్క విధంగా ప్రసన్నుడయ్యాడు శ్రీనారాయణుడు. ధ్రువుడు తన తండ్రి అంక పీఠం కావాలని అది ఒక్క నారాయణుడు ఇస్తాడని తెలిసి పని తనంలోనే తపస్సు చేస్తే అన్నింటికన్నా పైన ఉన్న ధ్రువలోకంను వరంగా ఇచ్చాడు. ఇలా ఒక్కో భక్తుడికి ఒక్కో రకంగా వరం ఇచ్చాడు ఆ స్వామి.

నారధుడు శ్రీమన్నారయణ భక్తుడని అందరికీ తెలిసిందే కదా. తనకు మించిన భక్తుడు నారాయణుడికి లేడని నిత్యం నారాయణ నామ స్మరణ చేస్తానని గర్వంతో చెప్తుంటాడు నారధుడు. నారదుడి గర్వాన్ని భగం చేయాలనుకున్నాడు శ్రీ మహా విష్ణువు. తన భక్తిలో మరింత మునిగి తేలాలంటే తాను చూపించిన కొలనులో స్నానం చేసి రావాలని చెప్పాడట. స్వామి మాటలు విన్న నారదుడు ఆ కొలనులోకి వెళ్లి దిగారట. పైకి లేవగానే యువతిగా మారిపోయారట.

గతం మర్చిపోయిన నారదుడు అక్కడికి వచ్చిన ఒక రాజును చూసి మోహించి పెళ్లి కూడా చేసుకున్నారట. 60 మంది పిల్లలకు జన్మనిచ్చారట. వారు పెద్దయ్యాక యుద్ధంలో ఒకరి తర్వాత ఒకరు మరణించారట. దీంతో తీవ్ర పుత్ర శోకంతో తల్లడిల్లుతున్న యువతి రూపంలో ఉన్న నారదుడిని పరామర్శించిన శ్రీమన్నారాయణ విష్ణు మాయ గురించి చెప్పారట. అలా యువతి రూపంలో ఉన్న నారదుడికి పుట్టిన బిడ్డలే తెలుగు సంవత్సరాల పేర్లుగా వచ్చాయి.

ఆ 60 మంది పేర్లు వారి వివరాలు..
1. ప్రభవ-ప్రభవించునది-పుట్టుక
2. విభవ-వైభవంగా ఉండేది
3. శుక్ల-తెల్లనిది-నిర్మలత్వం-కీర్తి-ఆనందాలకు ప్రతీక
4. ప్రమోదూత-ఆనందం-ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత
5. ప్రజోత్పత్తి-ప్రజ ఆంటే సంతానం-సంతాన వృద్ధి కలిగినది-ప్రజోత్పత్తి
6. అంగీరస-అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి
7. శ్రీముఖ-శుభమైన ముఖం
8. భావ-భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు
9. యువ-యువ అనేది బలానికి ప్రతీక
10. ధాత-అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర-పరమేశ్వరుడు
12. బహుధాన్య-సుభిక్షంగా ఉండడం
13. ప్రమాది-ప్రమాదమున్నవాడు అని అర్థం
14. విక్రమ-విక్రమం కలిగిన వాడు.
15. వృష-చర్మం
16. చిత్రభాను-భానుడంటే సూర్యుడు. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం
17. స్వభాను-స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ-తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం
19. పార్థివ- పృథ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి
20. వ్యయ-ఖర్చవడం..
21. సర్వజిత్తు-సర్వాన్ని జయించినది
22. సర్వధారి-సర్వాన్ని ధరించేది
23.విరోధి-విరోధం కలిగినట్టువంటిది
24. వికృతి-వికృతమైనది
25. ఖర-గాడిద, కాకి
26. నందన-కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది
27. విజయ-విశేషమైన జయం కలిగినది
28. జయ-జయాన్ని కలిగించేది
29. మన్మథ- మనస్సును మధించేది
30. దుర్ముఖి- చెడ్డ ముఖం కలది
31. హేవిలంబి-సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం
32. విలంబి-సాగదీయడం
33. వికారి-వికారం కలిగినది
34. శార్వరి-రాత్రి
35. ప్లవ-తెప్ప. కప్ప, జువ్వి-దాటించునది అని అర్థం
36. శుభకృత్-శుభాన్ని చేసి పెట్టేది
37. శోభకృత్-శోభను కలిగించేది
38. క్రోధి-క్రోధాన్ని కలిగినది
39. విశ్వావసు-విశ్వానికి సంబంధించినది
40. పరాభవ … అవమానం.
41. ప్లవంగ-కోతి, కప్ప
42. కీలక-పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య
43. సౌమ్య- మృదుత్వం
44. సాధారణ-సామాన్యం
45. విరోధికృత్-విరోధాలను కలిగించేది
46. పరీధావి-భయకారకం
47. ప్రమాదీచ- ప్రమాద కారకం
48. ఆనంద-ఆనందమయం
49. రాక్షస-రాక్షసత్వాన్ని కలిగినది
50. నల- నల్ల అనే పదానికి రూపాంతరం
51. పింగళ-ఒక నాడి, కోతి, పాము, ముంగిస
52. కాలయుక్తి-కాలానికి తగిన యుక్తి
53. సిద్ధార్థి-కోర్కెలు సిద్ధించినది
54. రౌద్రి-రౌద్రంగా ఉండేది
55. దుర్మతి-దుష్ట బుద్ధి
56. దుందుభి-వరుణుడు
57. రుధిరోద్గారి-రక్తాన్ని స్రవింప చేసేది
58. రక్తాక్షి-ఎర్రని కన్నులు కలది
59. క్రోదన-కోప స్వభావం కలది
60. అక్షయ-నశించనిది

TAGS