Bhashyam Praveen : టీడీపీ గాలిలో ‘నంబూరు’ కొట్టుకుపోతారు..భాష్యం ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు..

Bhashyam Praveen

Bhashyam Praveen

Bhashyam Praveen : ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీలో ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికలకు దాదాపు 22 రోజులే ఉండడంతో అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. బస్సుయాత్రలు, రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీకి జగన్ ఒక్కడే స్టార్ క్యాంపెయినర్ కాగా,  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి చంద్రబాబు, పవన్, భువనేశ్వరి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తి ఉన్న నియోజకవర్గాల్లో పెదకూరపాడు ఒకటి. ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి నంబూరు శంకరరావు పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ వరుసకు బంధువులు కావడంతో పోటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

వైసీపీ ఎమ్మెల్యేగా నంబూరు శంకరరావు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమి లేదని, ఒక్క హామీ నెరవేర్చలేదని స్థానికులే చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కన్నా ఆయన అక్రమ సంపాదనకే  ఎక్కువ సమయం కేటాయించారని అంటున్నారు. ఆయన చేయని దందా లేదని, ఎమ్మెల్యేగా ఆయన అన్నింటా విఫలమయ్యారని చెప్తున్నారు.

ఈనేపథ్యంలో భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు కొత్త కాదని, గత పదేళ్లుగా టీడీపీ కార్యకర్తగా, ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నానన్నారు. యువనాయకుడు నారా లోకేశ్ తన వెన్నంటే ప్రోత్సహిస్తున్నారన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే తొలుత వాటికే ప్రాధాన్యం ఇచ్చి బాగు చేస్తానన్నారు. నియోజకవర్గంలో కృష్ణానది ప్రవహిస్తున్నా తాగు, సాగు నీటి కష్టాలు ఉన్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తనవంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ నీటిని అందించే ప్రయత్నం చేస్తానన్నారు.

గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనేక అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టారని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆ కేసులను కొట్టించి వేస్తానన్నారు. కార్యకర్తలకు అండగా ఉన్నానన్నారు. తనకు సీటు రాగానే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కొమ్మలపాటి శ్రీధర్ ను కలిశానని, ఆయనతో కలిసే నియోజకవర్గంలో పనిచేయబోతున్నామని, తనకు సీటు రావడంపై ఆయన స్వాగతించారన్నారు. అందరినీ కలుపుకుపోయి నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధిస్తామన్నారు.  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గాలిలో పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు లాంటి వారే కాదు జగన్ కూడా కొట్టుకపోతారని భాష్యం ప్రవీణ్ చెప్పారు.

TAGS