Bhashyam Praveen : పెదకూరపాడులో భాష్యం ఆధ్వర్యంలో కొనసాగిన టీడీపీ ప్రజా గళం సభ భారీగా సక్సెస్ అయ్యింది. చంద్రబాబు నాయుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు. బాబుకు మద్దతిస్తామని నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సభ నుంచి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ తో పాటు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు గురించి మాట్లాడారు.
నంబూరి శంకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం అభివృద్ధి జరగదన్న బాబు. భాష్యంను అసెంబ్లీకి పంపిస్తే కొట్లాడి నిధులు తెచ్చుకుంటాడని తెలిపారు. తానే స్వయంగా పిలిచి మరీ నిధులు ఇస్తానని హామీ కూడా ఇచ్చారు. దీంతో సభ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఓటమి పాలవుతామని భావించిన వైసీపీ మూకలు మండల కేంద్రం క్రోసూరులో గల పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంను తగులబెట్టారని భాష్య ప్రవీణ్ ఆరోపించారు.
భాష్యం మాట్లాడుతూ ‘క్రోసూరులో ‘ప్రజాగళం’ సభ సూపర్ సక్సెస్ కావడంతో తట్టుకోలేక ఓటమి భయంతోనే శంకర్ రావు నియోజకవర్గంలో దాడులు, అక్రమ కేసులు, అరాచకాలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. గందరగోళ పరిస్థితులను సృష్టించి ప్రజలను అయోమయంలోకి నెట్టి అక్రమంగా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మెరకే ప్రజాగళం చంద్రబాబు సభ సక్సెస్ కావటమే కాక నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు పాల్గొనడంతో తట్టుకోలేకనే కార్యాలయాలు దహనం, గ్రామాలపై రౌడీ మూకలతో దాడుల యత్నం, అరాచకాలను ఉసుగొలిపి అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు శంకర్రావు.
అయితే, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. శంకర్ రావుకు ఈ సారి తగిన బుద్ధి చెప్తారు. కేవలం అధికార మదం, డబ్బు ఉందన్న అహంకారం మాత్రమే తన ఆయుధంగా మలుచుకొని దాడులు చేస్తున్నాడు. అధికారం శాశ్వతం కాదు నీకు తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారు. ఎన్నడూ లేని సంస్కృతికి తెర లేపావు ఇదే విధంగా నీకు బుద్ధి చెప్తారు ప్రజలు.. గుర్తుపెట్టుకో శంకర్ రావు అంటూ హెచ్చరించాడు.