Nallari Kiran kumar Reddy:తెరపైకి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి..పురంధేశ్వరికి బీజేపీ షాక్ ఇస్తోందా?
Nallari Kiran kumar Reddy:తెలంగాణలో రోజు రోజుకీ రాజకీయం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌పై కాలుదువ్వుతున్నారు. వరుస సమీక్షలతో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలోనూ రాజకీయం మారుతోంది. అక్కడ త్వరలో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న వేళ పార్టీలు సర్వం సిద్ధం చేసుకుంటూ పోటీకి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తులు మొదలు పట్టాయి.
టీడీపీ, జనసేన పొత్తుపై ఇటీవలే క్లారిటీ ఇచ్చాయి కూడా. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ కూడా కసరత్తులు మొదలు పెట్టింది. పార్టీని బలోపేతం చేయడానికి కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి షాక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఆమెను అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలని, ఆమె స్థానంలో మరో బలమైన నేతను తీసుకురావాలని ఇప్పటికే పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష స్థానం కోసం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి వచ్చినట్టుగా తెలిసింది. పురంధేవ్వరికి జూలైలో అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఎన్టీఆర్ కుమార్తె అని, తన వల్ల కమ్మ సామాజిక వర్గం పార్టీకి చేరువ అనుతుందని భావించారు. అంతే కాకుండా ఆమె టీడీపీ నాయకులని చాలా వరకు పార్టీలో చేరుస్తుందని అనుకున్నారు. కనీ ఏదీ జరగలేదు. ఆమెకు అధ్యక్ష పదవిని కట్టబెట్టిన ఫలితం శూన్యం అని బీజేపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది.
ఆ కారణంగానే ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ సమయంలో సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించి చివరికి తన సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీక రాజీనామా చేసిన నల్లారి ఆ తరువాత కొంత కాలం యాక్టీవ్‌గా కనిపించలేదు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఆయన బీజేపీలో చేరారు. అయిన అయితేనే ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తారని, ఆయన వల్ల బలమైన రెడ్డి సమాజిక వర్గం బీజేపీకి అండగా నిలిచే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయట. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధ్యక్షుడిగా ఆయన అయితేనే పార్టీని బలోపేతం చేస్తారని అధ్యక్ష పదవి నుంచి పురంధేశ్వరిని తప్పించి నల్లారిని అధ్యక్షుడిగా నియమించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ఈ ప్రచారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు.