Nagarjuna : సంక్రాంతి పండుగకి తమ సినిమాలను విడుదల చేసుకోవాలని ప్రతీ నిర్మాతకి, ప్రతీ హీరోకి ఉంటుంది. అలాంటి సమయం లోనే భారీ పోటీ వాతావరణం ఏర్పడుతుంది. ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి అనడం తో బయ్యర్స్ కి థియేటర్స్ ని సర్దుబాటు ఎలా చెయ్యాలో అర్థం కాక జుట్టు పీక్కున్నారు. ఈ సంక్రాంతికి అత్యధిక బిజినెస్ ని జరుపుకున్న చిత్రం ‘గుంటూరు కారం’ కాబట్టి, థియేటర్స్ ఓనర్లకు అందరికీ ఆ సినిమానే మొదటి ఛాయస్.
ఇక ఆ తర్వాత మిగిలిన సినిమాలవైపు చూస్తారు. మిగిలిన నాలుగు చిత్రాలు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే అయ్యినప్పటికీ థియేటర్స్ ని సర్దుబాటు చేయలేకపోయారు. పరిస్థితి క్లిష్టంగా మారడం తో రవితేజ తన ‘ఈగల్’ సినిమాని పొంగల్ రేస్ నుండి తప్పించాడు. ఇప్పుడు ఈగల్ థియేటర్స్ మొత్తం నాగార్జున ‘నా సామి రంగ’ సినిమాకి వెళ్లిపోయాయి.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ‘నా సామి రంగ’ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉందట. సెన్సార్ కాపీ ని సిద్ధం చేస్తున్నారు, ఈ నెల 10 లేదా 11 వ తారీఖున సెన్సార్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరో విషయం ఏమిటంటే సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా బ్యాలన్స్ ఉంది, సమయం లేకపోవడం తో ఒక పాట ని చిత్రీకరించకుండా వదిలేసారు. అయ్యినప్పటికీ కూడా బోలెడంత వర్క్ పెండింగ్ ఉంది. మూవీ టీం మొత్తం నిద్రాహారాలు మానేసి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. నాగార్జున రీసెంట్ గానే తన డబ్బింగ్ ని కూడా పూర్తి చేసాడు. అసలు ఈ సినిమాని ఆయన ఒప్పుకోవడానికి కారణం, సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేస్తానని నిర్మాత మాట ఇవ్వడం వల్లేనట. అందుకే నాగార్జున ఎలా అయినా ఈ చిత్రాన్ని సంక్రాంతికి దింపాలని పట్టుబట్టాడు. ఆయన గత సినిమాలు ఫ్లాప్స్ అవ్వడం వల్ల, ‘నా సామి రంగ’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పై గట్టి ప్రభావం పడింది.
దీంతో నాగార్జున అంతకు ముందు నిర్మాత వద్ద తీసుకున్న 5 కోట్ల రూపాయిలను తిరిగి ఇచ్చేసి, లాభాలు వచ్చినప్పుడు చూసుకుందాం అని నిర్మాతతో చెప్పి, ఆ తర్వాత బయ్యర్స్ తో మాట్లాడి సినిమాని విడుదల అయ్యేలా చేస్తున్నాడు. నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమాకి బిజినెస్ సరిగా జరగకపోవడం, ఆయన విడుదలకు ముందే తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయడం వంటి సంఘటనలు ఆయన అభిమానులను తీవ్రమైన బాధకి గురి చేస్తున్న విషయం. మరి జనవరి 14 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఫ్యాన్స్ బాధని మాయం చేస్తుందో లేదో చూడాలి.