Shriya Saran : నాగార్జున వద్దు అంటున్న బలవంతంగా నేర్పించాడు..ఇప్పుడు వదలలేకపోతున్నా..స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..
Shriya Saran : ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ అప్పట్లో మంచి గ్లామర్ తో పాటు అభినయంతోనూ అకట్టుకుంది. ఇప్పటికీ ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ స్టార్ హీరోలందరితోనూ నటించింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళంలో నటించి మంచి పేరే సంపాదించింది. ఆ తర్వాత ఆండ్రీ కొస్చీవ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఓ కూతురు కూడా పుట్టింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన శ్రియ ఇటీవల కబ్జా మూవీతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కింగ్ నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ఎంతో మంది అద్భుతమైన నటులున్నారని, వారిలో కొందరితో తాను కూడా నటించానని పేర్కొంది. అందులో తనకు మాత్రం నాగార్జున అంటే బాగా ఇష్టమని, ఆయన ఒక స్టార్ హీరోలా కాకుండా ఫ్రెండ్ లా అన్నీ అర్థమయ్యేలా చెప్పేవాడని తెలిపింది. ఆయనతో నటించే సమయంలో ధ్యానం చేయడం ఎలాగో నేర్పించారంది. ఫస్ట్ లో తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పినా, బలవంతంగా నాగ్ దగ్గరుండి నేర్పించారు. ఇప్పటికీ తాను ధ్యానం చేయడం వదలలేదని చెప్పుకొచ్చింది.
ధ్యానం చేయడం వల్లే తన లైఫ్ లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొగలుగుతున్నానని తెలిపింది. అంతే కాదు నాగార్జున తన కోసం ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చేవారని కూడా చెప్పింది. తమ మధ్య ఎన్నో ఫన్న మూమెంట్స్ ఉన్నాయని మురిసిపోతూ తెలిపింది. ప్రస్తుతం శ్రియా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.