Nagarjuna daughter-in-law : చిరంజీవికి కోడలు శోభితాను పరిచయం చేసిన నాగార్జున.. ఏం మాట్లాడుకున్నారో తెలుసా?
అమితాబ్ బచ్చన్ కు నాగార్జున ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున తనకు కాబోయే కొత్త కోడలు శోభితా దూళిపాళ్లను పరిచయం చేశారు. స్టేజీ పైనే శోభితాను చిరంజీవికి పరిచయం చేయగా.. వారిద్దరూ ఒక నిమిషం పాటు కలిసి మాట్లాడుకున్నారు. శోభితా దూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన ఫ్యామిలిలో పుట్టిన తెలుగు నటి. కానీ మొదట ఆమె బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకున్నారు.
నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల నిశ్చితార్థం ఈ మధ్యనే జరిగింది. వీరి పెళ్లి త్వరలో వైజాగ్ లో జరగనుందని సమాచారం. ఈ పెళ్లికి చాలా మందిని పిలిచి గ్రాండ్ గా చేసుకునే ప్లాన్ లో నాగ చైతన్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్య సమంత 2017 లో పెళ్లి చేసుకోగా.. 2021 లో మనస్పర్థల కారణంగా విడిపోయారు.
సమంత, నాగ చైతన్య ఇద్దరూ కలిసి నటించిన సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టగా.. ఆ తర్వాత హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం.. పెళ్లి చేసుకున్నారు. వీరు విడిపోయిన వెంటనే శోభితాతో లవ్ ట్రాక్ నడుస్తుందని చాలా రూమర్స్ వచ్చినా వాటి గురించి పట్టించుకోలేదు. చివరకు అదే నిజమైంది. ప్రస్తుతం వీరిద్దరూ ఒక్కటై వివాహం చేసుకుంటుండగా.. సమంత మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. కాగా ఏఎన్నార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఏటా ఏఎన్నార్ అవార్డుల ప్రదానం చేస్తుండగా.. ఈ సారి లెజెండ్ మెగాస్టార్ చిరంజీవికి ఈ నేషనల్ అవార్డు దక్కింది.