కాగా నాగార్జున బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల ఆయనలో ఉన్న కొత్త కోణం బయటపడింది. ఇప్పటి వరకు హీరోగా తనెంటో చూపించిన నాగార్జున తాజాగా విలన్ గా నటించనున్నట్లు చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
లోకేశ్ కనకరాజ్ అనే డైరెక్టర్ తీస్తున్న కూలీ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. సినిమా కథ చెప్పిన వెంటనే ఓకే చేసిన నాగార్జున ప్రస్తుతం కాస్త అప్ సెట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విలన్ క్యారెక్టర్ ను కథ చెప్పే సమయంలో హైలెవల్ లో క్రియేట్ చేసిన ఆయన ప్రస్తుతం మాత్రం సినిమా షూటింగ్ తీసే సమయంలో కాస్త వెనకబడ్డట్లు దీనిపై నాగార్జున కూడా ఇదెంటీ ఇలా ఉంటుందేంటీ అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
హీరోగానే అందరికీ తెలిసిన నాగార్జున ప్రస్తుతం విలన్ అనగానే చాలా మంది ఊహించుకోలేకపోతున్నారు. నాగార్జున అంటేనే 60 ఏండ్లు దాటినా కూడా అందరికీ డ్రీమ్ బాయ్, గ్రీకు వీరుడుగా పిలుచుకుంటారు. అలాంటిది లోకేశ్ కనకరాజ్ ఇలా విలన్ క్యారెక్టర్ చేయిస్తున్నాడేంటి అని తెలుగు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మొత్తం మీద ఎప్పుడు కొత్తదనం కోరుకునే నాగార్జున ఈసారి కూడా అదే లెవల్లో కొత్తదనాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు.