Nagarjuna : అభిమానికి  క్షమాపణ చెప్పిన నాగార్జున.. అసలేం జరిగిందంటే

Nagarjuna

Nagarjuna

Nagarjuna : సినిమా హిరోలు, సెలబ్రేటీలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ వారిని ఒక్కసారైనా కలవాలనుకుంటారు. వారితో ఒక్క ఫొటో దిగితే చాలు జీవితం ధన్యమవుతుందని అనుకుంటారు. అలాంటి ఫ్యాన్స్ గురించి కొంతమంది హిరోలు అస్సలు పట్టించుకోరు. ఎంతో మంది ఫ్యాన్స్ తమ అభిమాన హిరోలను కలవాలనుకుంటున్న సమయంలో గాయాలపాలవుతున్నారు. కొంత మందైతే చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

ముంబై ఎయిర్ పోర్టులో హిరో నాగార్జున వెళుతున్న సమయంలో ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. నాగార్జున ను చూసిన అభిమాని ఆయనను కలిసేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ అభిమాని కింద పడిపోయాడు. ఈ విషయం కాస్త హిరో నాగార్జునకు తెలిసింది. ఈ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. చాలా దురదృష్టకరం ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఆయనకు నా క్షమాపణలు చెబుతున్నాను అని నాగార్జున ఎమోషనల్ పోస్టు చేశారు.

నాగార్జున లాంటి సెలబ్రెటీ ఇలా ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పడంతో కొంత మంది ఆయన మంచితనం గురించి కొనియాడుతున్నారు. ఫ్యాన్స్ అంటే గౌరవం ఉండ బట్టే ఇలా క్షమాపణ చెప్పాడని అంటున్నారు. మరి కొంత మంది మాత్రం ఒక్క క్షణం ఆగి అభిమానిని పలకరిస్తే మీ సొమ్ములు ఏమైనా పోతాయా అంటూ మండిపడుతున్నారు. ఏదేమైనా మితి మీరిన అభిమానం పనికిరాదని ఈ సంఘటన గుర్తుకు చేస్తుంది.

తమ అభిమాన హిరోల సినిమాలు రిలీజ్ అయినపుడు పోస్టర్లు, కటౌట్ లు కట్టి దండలు వేసి, ప్రచారం చేసి హిట్ అయితే సంబరాలు చేసుకునే ఫ్యాన్స్ కు ఇలాంటి సంఘటనలు ఎదురవడం కామనే. వీటిన్నింటినీ తట్టుకుని తమ అభిమాన హిరోల కోసం వారు ఏ మాత్రం లాభపేక్ష లేకుండా తమ అభిమానాన్ని కురిపిస్తూనే ఉంటారు. ఇకనైనా కొంత మంది సెలబ్రెటీలు, హిరోలు తమ అభిమానుల గురించి కాస్త ఆలోచించాలని కోరుతున్నారు. 

TAGS