Nagababu Viral Video : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు అటు బహిరంగ సభల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే జనసేన సీనియర్ నేత, మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ అధినేత జగన్ పై పొలాలు దోచేసే పులివెందుల పులకేశి అంటూ సోషల్ మీడియా ఓ వీడియోను వదిలారు. భూకబ్జా ముఠా నాయకుడు అలియాస్ పులివెందుల పులకేశి అని వైఎస్ జగన్ ను ట్యాగ్ చేస్తూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఆయన మాటల్లోనే..
‘‘హైదరాబాద్ లోని శివశివాని స్కూల్ లో పదో తరగతి పరీక్ష పేపర్లు దొంగలించారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని పెద్ద అల్లరైంది. స్కూల్ స్టూడెంట్లు చేశారని తెలిసింది. దాని వెనక ఉన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తేల్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కావడంతో మేనేజ్ చేశారు. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గుర్తుచేశారు. నాడు పరీక్ష పేపర్ల దొంగలకు మాస్టర్ మైండ్ గా ఉన్న జగన్ ..ముఖ్యమంత్రి అయ్యాక మన ఆస్తులను దోచుకోవడానికే స్కెచ్ లు వేశాడు. అందుకు తన కావాల్సిన విధంగా చట్టాలు రాసుకుంటున్నాడు. వ్యవసాయ భూములు మీ పేరు మీద ఉన్నవి తెల్లారే సరికి ఎవరి పేరు మీద మారిపోతాయో తెలియదు. మీ పొలం ఎక్కడో పులివెందుల పేటలో ఉన్నవారికో, తాడేపల్లి కోటలో ఉన్న మనుషులకో మారిపోతాయి.. ’’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.
జగన్ ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టం ‘‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్’’ను 2022లో తెచ్చారు. ఈ చట్టం ద్వారా చిన్న,సన్నకారు రైతుల భూములకు రక్షణ లేదని న్యాయవాదులు సైతం నిరసనలు వ్యక్తం చేశారు. అయినా జగన్ ప్రభుత్వం ఆ చట్టాన్ని కొనసాగిస్తూ పేదల భూములను వైసీపీ మూకలు లాక్కుంటున్నాయంటూ ఆరోపించారు. టెన్త్ పరీక్ష పేపర్లు దొంగిలించిన నాడే జగన్ తల్లి శిక్షిస్తే ఈనాడు పేదల భూములు లాక్కునే వాడు కాదంటూ నాగబాబు వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను టీడీపీ, జనసేన శ్రేణులు షేర్ చేస్తుంటే..వైసీపీ శ్రేణులు నాగబాబుపై మండిపడుతున్నాయి.
కాగా, నాగబాబు వీడియో ఆలోచింపజేసేట్టుగా ఉంది. సగటు రైతుకు కూడా ఎంతో చక్కగా అర్థమయ్యేలా ఉంది. ఈ వీడియోను చూసిన సగటు రైతు వైసీపీకి ఓటు వేయమన్న వేయడు అని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చట్టం చీకటి చట్టం అని స్వయంగా న్యాయవాదులు మొత్తుకున్నా ప్రభుత్వం వినలేదు. న్యాయవాదులపైనే ఎదురుదాడి చేశారు. రైతులకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే పరిస్థితి లేదు. అప్పిలేట్ ట్రిబ్యునల్ వద్దకు మాత్రమే వెళ్లాలి. లేదంటే హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. మరి సామాన్య రైతు ఇవన్నీ బాధలు పడగలడా? అని నాగబాబు ప్రశ్నించారు. రైతుల భూమి ఇతరుల పేరు మీదకు మారిందనే విషయం కూడా వారికి చెప్పరు. ఎవరికీ వారు తెలుసుకోవాల్సిందే. మీ భూమి యజమాని మారాడని 90 రోజుల్లో తెలుసుకోకపోతే ఇక అంతే సంగతి.