JAISW News Telugu

Nagababu Political Future : వారి సహకారంపైనే నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్?

Nagababu Political Future

Nagababu Political Future

Nagababu Political Future : టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి నాగబాబు పోటీ చేయనున్నారనే వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఈ విషయం నాగబాబు మాటల ద్వారా కూడా అర్థమవుతోంది. అయితే జనసైనికులు, జనసేన నేతల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాగబాబు అనకాపల్లిలో గెలవగలరా? అక్కడి సామాజిక పరిస్థితులు వేరు వీటిని నాగబాబు ఎలా హ్యాండిల్ చేస్తారు? అని వారు మధనపడుతున్నారు. అసలే ఉత్తరాంధ్రలో ఉన్నన్ని కులాలు ఇంకెక్కడా ఉండవు. మిగిలిన నియోజకవర్గాలను వదలిసినా అనకాపల్లిలో తూర్పు కాపులు, కొప్పుల వెలమలు చాలా బలమైన సామాజిక వర్గాలు. ఈ రెండు సామాజిక వర్గాలను కాదని మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఏమి చేయలేరు.

ఇప్పుడు నాగబాబు పైన చెప్పిన రెండు సామాజిక వర్గాల్లో దేనికీ చెందరు. పైగా నాగబాబుది గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గం. కాపులు అంటే అగ్రవర్ణాలకు చెందినవారు.  అదే తూర్పు కాపులు, కొప్పుల వెలమలు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. పైగా మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుని ఇప్పుడు అన్యాయం చేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. గవర ఉపకులానికి చెందిన నేత కొణతాలకు అన్యాయం జరుగుతోందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

ఇదే టైంలో వైసీపీ తరపున డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు లోక్ సభకు పోటీ చేయవచ్చని అంటున్నారు. బూడి ముత్యాలనాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కొప్పుల వెలమ, గవర్లు, తూర్పు కాపులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి నాగబాబుకు పై సామాజిక వర్గాల నుంచి ఏ మేరకు సహకారం అందుతుందో అనుమానమే అని పార్టీలోనే తీవ్ర చర్చ నడుస్తోంది.

ఇప్పుడు బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉన్న మాడుగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాడుగులలో గవర సామాజిక వర్గం బలంగా ఉంది. కాబట్టి వైసీపీ నుంచి బూడి, జనసేన తరపున నాగబాబు ఎంపీగా పోటీ చేస్తే టఫ్ ఫైట్ నడువనుంది. పోటీ ఎంత టఫ్ గా ఉన్నా నాగబాబుకు గెలుపు అవకాశాలు స్పల్పంగానే కనిపిస్తున్నాయి. టీడీపీ కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థిని బట్టి వైసీపీ అభ్యర్థిని పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Exit mobile version