Nagababu Emotional : వరుణ్ తేజ్ రిసప్షన్ లో ఎమోషనల్ అయిన నాగబాబు.. అన్నా, తమ్ముడితో ఏమన్నారంటే..

Nagababu Emotional

Nagababu Emotional

Nagababu Emotional : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టుస్కానీలో నవంబర్ 1వ తేదీ గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే ఇటలీలో వివాహానికి వెళ్లారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నవంబర్ 5 (ఆదివారం)న  గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీంతో నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు టాలీవుడ్ తో పాటు కోలివుడ్ నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు. నాగ చైతన్య, సైనా నెహ్వాల్, ఇలా వివిధ రంగాలకు సంబంధించి ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు.

పెళ్లికి వెళ్లనివారు రిసెప్షన్ కు వచ్చారు. ప్రముఖుల రాకతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంతా సందడిగా మారింది. ప్రముఖులు హాజరవడం, వారిని కవర్ చేసేందుకు మీడియా కూడా రావడంతో మరింత గ్రాండ్ గా జరిగింది. వివాహానికి, రిసెప్షన్ కు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులనే వరుణ్, లావణ్య ధరించారు. రిసెప్షన్ ప్రారంభానికి ముందు కాక్ టెయిల్ వేడుక నిర్వహించారు.

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్, రాం చరణ్, నితిన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్రముఖులు వేడుకలకు వారి వారి సతీమణులతో వచ్చారు. దంపతులను కలిసి అక్షింతలు వేసి దీవించారు. ఆ తర్వాత భోజనం చేసి వెళ్లారు. కార్యక్రమం ఆసాంతం సందడిగా, ఆనందంగా సాగింది. వరుణ్ తేజ్ పెళ్లిలో ఆయన చెల్లెలు నిహారిక సందడి అందాన్ని మరింత పెంచింది.

ఇటీవల మెగా బ్రదర్స్ విషయంలో వచ్చిన రూమర్స్ వరుణ్-లావణ్య వివాహంతో పటాపంచలు అయ్యాయి. వీరి నిశ్చితార్థం సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే రావడంతో.. చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేశారు. వాటిన్నింటినీ ఖండిస్తూ తన భార్యతో కలిసి వివాహానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. ముగ్గురు కలవడంతో నాగబాబు చాలా ఎమోషనల్ అయ్యారు. మెగా కుటుంబం అన్న చిరంజీవి దీవెనలతో ఎప్పుడూ కలిసే ఉంటుందని, కుటుంబం అన్నాక చిన్ని చిన్న గొడవలు కామన్ అని.. అవి రాకుంటే బందం పలుచబడిందనుకోవాలని అన్నారు.

TAGS