Naga Chaitanya : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగ చైతన్య రియాక్ట్.. అన్ని తర్వాత చెబుతా..

Naga Chaitanya

Naga Chaitanya

Naga Chaitanya : మాదాపూర్ తుమ్మడి కుంట చెరువు ఆనుకుని ఎఫ్టీపీ, బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కలిసి దాన్ని కూల్చివేశాయి. కాగా దీనిపై ఇప్పటికే నాగార్జున ఎక్స్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక్క అంగుళం భూమి కూడా తాము ఆక్రమించలేదని తాము పట్టా భూమిలోనే దాన్ని నిర్మించామని చెప్పుకొచ్చారు. కోర్టు వద్దని చెబుతున్నా.. కూడా దాన్ని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 నాగార్జున కొడుకు తాజాగా హిమయత్ సాగర్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు రాగా.. విలేకర్లు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మీ అభిప్రాయం చెప్పండని అడిగారు. దీంతో ఇప్పుడు కాదు తర్వాత చెబుతాను. అయినా దీనిపై నాన్న (నాగార్జున) స్పందించారు. ఎక్స్ లో ప్రతిదానికి సమాధానం చెప్పారని దాటవేశారు.

 ప్రస్తుతం ఎక్కడ చూసినా నాగచైతన్య పేరు వినిపిస్తోంది. కారణం ఏమిటని అడగ్గా మీరు ఎక్కువగా నా పేరును యూజ్ చేస్తుండవచ్చు.. అందుకే అలా అనిపించి ఉంటుందని అన్నాడు. నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకుని తాజాగా ఆగస్టు 8న శోభితా దూళిపాళ్ల తో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని ఆ విషయాన్ని మీ అందరికీ చెబుతానని నాగ చైతన్య అన్నారు.

పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, అనేది మీకు తెలియకుండా జరగదు. ఇప్పుడు కేవలం ఒక చిన్న ప్రోగ్రాంకు వచ్చాను. అది సక్సెస్ కావాలని కోరుకుంటున్న అని అన్నారు. నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిసి ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు. చిలుకా, గోరింకల్ల ఉన్న వీరు విడిపోవడం ఏంటనీ చాలా మంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిన్నింటికీ చెక్ పెడుతూ.. నాగ చైతన్య శోభితా దూళిపాళ్ల తన జీవిత భాగస్వామిగా రాబోతుందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

TAGS