Naga Chaitanya : నాగ చైతన్యకు మరోసారి ఎదురు దెబ్బ..!
ఈ మూవీని సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ మొదట అనుకున్నారు. ఆ దిశగానే షూటింగ్ వేగంగా కొనసాగిస్తున్నారు. సంక్రాంతికి చైతూ వస్తున్నాడంటూ టాలీవుడ్ సర్కిల్ లో టాక్ వినిపించింది. కానీ మనసు మార్చుకున్నారు. సంక్రాంతి నుంచి వాయిదా వేసి ఫిబ్రవరి 7న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
దీంతో నాగచైతన్యను పెద్ద స్టార్ల జాబితాలోకి నెట్టేస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతి లాంటి లాభసాటి సీజన్ నుంచి తప్పుకుంటే నాగచైతన్య నిజంగా ఎప్పుడు స్టార్ అవుతాడోనని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ హీరో అయినా తన సినిమా సంక్రాంతికి విడుదల కావడం గర్వకారణమని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటాడు. ఇందులో నిలిస్తే సదరు హీరో టాప్ టైర్ కు చెందినవాడని తెలుస్తుంది. సంక్రాంతి బరిలో గెలిస్తే ఏ హీరోకైనా గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి.
గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి మద్దతు ఉన్నప్పటికీ తండేల్ ఫిబ్రవరికి వాయిదా పడడం నాగ చైతన్యకు వ్యక్తిగతంగా ఎదురుదెబ్బే. అయితే, తండేల్ ఇంకా సంక్రాంతి విడుదలపై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై దిల్ రాజుతో అల్లు అరవింద్ సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆంధ్రాలో థియేటర్లపై చెప్పుకోదగ్గ పట్టున్న పెద్ద డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్.