Naga Chaitanya : ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నాగ చైతన్య..చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

Naga Chaitanya who is suffering from a fatal disease
Naga Chaitanya : గత కొంత కాలం నుండి సమంత మయోసిటిస్ వ్యాధికి గురై తీవ్రమైన అస్వస్థత ఎదురుకుంటున్న విషయం తెలిసి ఆమె అభిమానులు, సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ ఎంత బాదపడ్డారో మన అందరికీ తెలిసిందే. నాగచైతన్య తో విడిపోయిన తర్వాత అత్యంత మనోవేదనకు గురైన సమంత, ఆ డిప్రెషన్ నుండి కోలుకోవడానికి చేసిన కొన్ని ప్రక్రియల కారణంగానే ఆమెకు మయోసిటిస్ వ్యాధి సోకడానికి కారణం అయ్యింది. కానీ ఆ వ్యాధిని ఆమె విజయవంతంగా ఎదురుకొని, సరైన శస్త్ర చికిత్స తీసుకొని ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె అతి త్వరలోనే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈమె మాజీ భర్త నాగ చైతన్య గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ ప్రచారం సాగుతుంది.
అదేమిటంటే నాగ చైతన్య గత కొంతకాలం నుండి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడట. ప్రస్తుతం సీక్రెట్ గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ని తీసుకుంటున్నాడని, ఇప్పుడు చాలా వరకు ఆయన కోలుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ వ్యాధి ఏమిటి అనేది బయటకి రానివ్వలేదు కానీ, నాగ చైతన్య కూడా సమంత లాగానే ఆ వ్యాధి నుండి కోలుకున్నాడట. ఈ విషయం బయటకి లీక్ అయితే అక్కనేని అభిమానులు కంగారు పడుతారని ఉద్దేశ్యం తో బయటకి లీక్ కానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ సోషల్ మీడియా లో ఏ విషయం కూడా ఎక్కువ కాలం దాగదు, చాలా తొందరగా బయటపడిపోతుంది. అలా నాగ చైతన్య విషయం కూడా బయటపడింది.