JAISW News Telugu

Naga Chaitanya : సమంతను చూడగానే సిగ్గుపడ్డ నాగచైతన్య.. ఇప్పటికీ అది అలాగే !!

Naga Chaitanya

Naga Chaitanya

Naga Chaitanya : డైవర్స్ కు ముందు.. డైవర్స్ తర్వాత నాగ చైతన్య గుర్తుకు వస్తే సమంత.. సమంత గుర్తుకు వస్తే.. నాగ చైతన్య మదిలో మెదులుతారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. మూడు కుటుంబాల సమ్మతితో (దగ్గుబాటి, అక్కినేని, సమంత) వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కానీ కాపురం మాత్రం మూన్నాళ్ల ముచ్చటగా నిలిచింది. తక్కువ సమయంలోనే ఇద్దరూ డైవర్స్ తీసుకున్నారు.

2014లో విడుదలైన ‘మనం’ చిత్రం తెలుగు సినిమాల్లో నిస్సందేహంగా ఒక క్లాసిక్ అనే చెప్పాలి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాలు నటించాయి. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నిన్న (మే 23) రాత్రి దేవి 70 ఎంఎంలో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్ లో నాగ చైతన్య మనం దర్శకుడితో కలిసి సినిమాను వీక్షించాడు. అభిమానులు ఆయనపై అభిమానం కురిపించారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు చూస్తే అభిమానులు సినిమాపై, నటుడిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కొన్ని వీడియోల్లో నాగచైతన్య తన మాజీ భార్య సమంతతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూస్తూ సిగ్గుపడుతూ కనిపించాడు. ఈ రొమాంటిక్ సన్నివేశాలను ఆయన ఆస్వాదించడం హృదయాన్ని హత్తుకునే దృశ్యం. 2021లో విడిపోయినప్పటికీ 2017లో వీరి పెళ్లికి దారితీసిన గాఢమైన ప్రేమను గుర్తు చేసుకుంటూ చైతన్య, సమంత ఇద్దరి మద్య ఉన్న కెమిస్ట్రీని తెరపై చూసి అభిమానులు మురిసిపోయారు. అభిమానులే కాదు నాగచైతన్య, సమంత కూడా ఆదరించే స్పెషల్ మూవీ ‘మనం’.

Exit mobile version