JAISW News Telugu

Naga Chaitanya : నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనేనా?

Naga Chaitanya

Naga Chaitanya

Naga Chaitanya : అక్కినేని నాగార్జున కొడుకు హీరో నాగ చైతన్య పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో నాగ చైతన్య ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. డిసెంబర్ నాలుగో తేదీన పెళ్లి జరగనుందని దీనికి సంబంధించిన ఏర్పాట్లు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డెకరేషన్ పనులు ప్రారంభించినట్లు, పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో వీరి పెళ్లి వైజాగ్ లో జరుగుతుందని, విదేశాల్లో చేసుకుంటారని చాలా రూమర్స్ వచ్చినా అవేవీ నిజం కావని తెలుస్తోంది.

నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరు నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న విషయం తెలిసిందే. కానీ వీరి మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సమంత చాలా డిఫ్రెషన్ లోకి వెళ్లిపోయింది. దీంతో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుని పలు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.  విడాకుల సమయంలో అందరూ సమంతదే తప్పు అన్నట్లు మాట్లాడారు.

చివరకు నాగ చైతన్య శోభితతో లవ్ ట్రాక్ తెలిసి వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారనే వార్త వినిపించగానే సమంతకు మద్దతుగా మాట్లాడుతున్నారు. శోభిత ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ కాగా.. ఈమెకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ రంగంపై ఇష్టం ఉండటంతో ముంబయి వెళ్లి అక్కడే కోర్సు నేర్చుకుని బాలీవుడ్ సినిమాల్లో మొదటి సారి అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు మూవీల్లో కూడా నటిస్తూ నాగచైతన్యతో లవ్ లో పడి పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

Exit mobile version