JAISW News Telugu

Naga Chaitanya : ఒక్కటి కాబోతున్న నాగచైతన్య, శోభితా ధూళ్లిపాళ్ల.. ఎంగేజ్ మెంట్ పూర్తి

Naga Chaitanya

Naga Chaitanya Engagement

Naga Chaitanya : సినీతారలు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెండ్లితో ఒక్కటి కాబోతున్నారు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నదని వార్తలు బయటకు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ ఈ రోజు వారిద్దరి నిశ్చితార్థం జరిగింది. దీనిని అధికారికంగా నాగచైతన్య తండ్రి హీరో నాగర్జున ప్రకటించారు. ఈరోజు ఉదయం 9.42 గంటలకు వారిద్దరి నిశ్చితార్థ తంతు నిర్వహించినట్లు చెప్పారు. అత్యంత సమీప బంధువుల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. ఈ జంట జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగ్ ఆశీర్వదించారు.

గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరిది కూడా ప్రేమవివాహం. కొన్నాళ్లు వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో వచ్చేన విభేదాలతో విడిపోయారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ విడాకులు తీసుకున్నారు. కొన్ని అనివార్య కారణ వల్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఇరువురూ ప్రకటించారు.

అయితే నాగచైతన్య, సమంత విడిపోయిన అనంతరం శోభితా ధూళిపాళ్ల విషయం బయటకు వచ్చింది. నాగచైతన్య, శోభిత తో ప్రేమలో పడ్డారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇద్దరు దీనిని ధ్రువీకరించలేదు. అయితే నాటి నుంచి కొన్నికార్యక్రమాలకు ఇద్దరూ జంటగా వెళ్లడం తో అందరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫం చేసుకున్నారు. ఇక ఇఫ్పుడు వీరిద్దరూ పెండ్లితో ఏకం కాబోతున్నారు. ఇదే విషయాన్ని తొలుత నాగర్జున ప్రకటించారు. గురువారం ఉదయం వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు ధ్రువీకరించారు. ఎంగెజ్ మెంట్ ఫొటోల్లో చైతన్య వైట్ కలర్ డ్రెస్సులో లుక్ ఇస్తే, ఇక శోభిత సంప్రదాయ పద్ధతిలో పింక్ కలర్ చీర కట్టుకుని కనిపించింది. శోభితను సంతోషంగా తమ కుటుంబసభ్యురాలిగా ఆహ్వానిస్తున్నట్లు హీరో నాగర్జున ట్వీట్ చేశారు. నాగర్జున ఇంట్లోనే ఈ వేడుక జరిగింది. కొద్ది మంది సన్నిహితులు, ఇరు కుటుంబాలు ఈ వేడుకలో పాలుపంచుకున్నాయి. త్వరలోనే మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి, అనౌన్స్ చేస్తారని సమాచారం.

Exit mobile version